అన్నాచెల్లెళ్ల అనుబంధం.. జన్మజన్మల సంబంధం | - | Sakshi
Sakshi News home page

అన్నాచెల్లెళ్ల అనుబంధం.. జన్మజన్మల సంబంధం

Aug 29 2026 2:04 AM | Updated on Aug 29 2026 2:04 AM

వర్ధన్నపేటకు చెందిన వడ్లకొండ సాయి చరణ్‌ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అతడి జ్ఞాపకార్థం తల్లిదండ్రులు తమ వ్యవసాయ క్షేత్రంలో విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అన్న లేకపోయినా అతడి జ్ఞాపకాలు శాశ్వతమని నిరూపిస్తూ చెల్లి శ్రీకృతి శుక్రవారం సాయిచరణ్‌ విగ్రహానికి రాఖీ కట్టి ప్రేమానురాగాలను చాటుకుంది. –వర్ధన్నపేట

సోదరుల విగ్రహాలకు రాఖీ కట్టి ఆప్యాయతను పంచిన చెల్లెళ్లు

మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన గుగులోత్‌ లక్ష్మణ్‌ మూడేళ్ల క్రితం మృతి చెందాడు. అతడి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు తమ వ్యవసాయ క్షేత్రంలో విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏటా చెల్లెళ్లు బానోత్‌ లింగమ్మ, వాంకుడోత్‌ రాధా.. లక్ష్మణ్‌ విగ్రహానికి రాఖీ కడుతున్నారు. ఈ ఏడాది కూడా లక్ష్మణ్‌ విగ్రహంతోపాటు మరో సోదరుడు రవి రాఖీ కట్టి తమ ఆప్యాయతను చాటుకున్నారు. –ఇనుగుర్తి

డ్యూటీలో ఉన్న తమ్ముడికి రాఖీ

ఆ అక్కా తమ్ముళ్ల ప్రేమాభిమానాలు చక్కటి అనుబంధానికి ప్రతీకగా నిలిచాయి. టీజీఎస్‌ ఆర్టీసీ వరంగల్‌–1 డిపోలో కండక్టర్‌గా ఉద్యోగం చేస్తున్న తమ్ముడు శ్రీనివాస్‌కు శుక్రవారం రాఖీ కట్టేందుకు అక్క కడారి రేణుక దామెర నుంచి హనుమకొండకు వచ్చింది. తమ్ముడు డ్యూటీలో ఉన్నాడని తెలుసుకుని హనుమకొండ బస్‌స్టేషన్‌కు చేరుకుంది. గంట సేపు తర్వాత పాలకుర్తి రూట్‌లో డ్యూటీచేస్తూ బస్‌స్టేషన్‌కు తమ్ముడు శ్రీనివాస్‌ చేరుకోగానే బస్సు ఎక్కి రాఖీ కట్టింది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు అక్కాతమ్ముడి మధ్య ఉన్న ప్రేమను అభినందించారు. –హన్మకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement