హన్మకొండ అర్బన్ : నవజాత శిశువులు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణతోపాటు శిశు, మాతృ మరణాల రేటును తగ్గించడమే లక్ష్యంగా వరంగల్‌లో సెంట్రల్ జోన్ పిడియాట్రిక్స్ కాన్ఫరెన్స్ ప్రారంభమైనట్లు కాన్ఫరెన్స్ వర్క్‌షాప్ చైర్మన్ డాక్టర్ బలరామ్ తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన ఈ కాన్ఫరెన్స్‌లో యువ వైద్యులకు ఆరు కీలక అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర వెంటిలేషన్, పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్ (పీఓసీయూఎస్), పోషకాహార లోపాల నివారణ, అలర్జీ, చిన్నారులపై హింస నివారణ తదితర అంశాలపై వైద్యులకు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. 2026 ఐఏపీ ప్రెసిడెన్షియల్ యాక్షన్ ప్లాన్ లోని అంశాలపైనా శిక్షణ అందిస్తున్నారని, 2030 నాటికి ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా శిశు, మాతృ మరణాలను గణనీయంగా తగ్గించడమే సదస్సు ప్రధాన ఉద్దేశమని వైద్య నిపుణులు తెలిపారు. సీఐఏపీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు డాక్టర్ బి. సుగుణాకర్ రెడ్డి, డాక్టర్ కె. రాజశేఖర్ రావు, డాక్టర్ కె. వెంకటేశ్వర్ రావు, డాక్టర్ ఎం. శేషు మాధవ్, పీఏటీఎస్ ప్రతినిధులు డాక్టర్ గుడురు విజయ్ కుమార్, డాక్టర్ ఎస్. కష్ణమూర్తి, డాక్టర్ సుంకోజ్ భాస్కర్, డాక్టర్ ఎన్.ఎల్. శ్రీధర్, డాక్టర్ శ్రీకృష్ణ ఆర్‌ఎస్‌వీ, వరంగల్ పీడియాట్రిక్ సొసైటీ నాయకులు డాక్టర్ జి. రమేశ్, డాక్టర్ పి. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సెంట్రల్ జోన్ పిడియాట్రిక్స్
కాన్ఫరెన్స్ వర్క్‌షాప్ చైర్మన్ బలరామ్


