ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ● కాకతీయ వైద్య కళాశాలలో వనమహోత్సవం
కాశిబుగ్గ: మొక్కలు నాటడం బాధ్యతగా భావించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సూచించారు. కాకతీయ వైద్య కళాశాలలో వరంగల్ పూర్వ విద్యార్థుల సంఘం, కళాశాల యాజమాన్యం సహకారంతో మంగళవారం వనమహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని హాజరై మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా తీసుకోవాలన్నారు. అనంతరం అటవీ శాఖ అధికారులు అందించిన వెయ్యి మొక్కలను కేఎంసీ ప్రాంగణంలో నాటారు. అలాగే, పూర్వ విద్యార్థి, ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ జంధ్యం దివాకర్ రూ.లక్ష విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. అలుమిని అధ్యక్షుడు డాక్టర్ కస్తూరి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాసు, జిల్లా అటవీశాఖ అధికారి ముకుందరెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, డాక్టర్ పి.విజయ్‌చందర్‌రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, పి.ఉపేందర్‌రెడ్డి, పి.విజయకుమారి, రాంచందర్, లక్ష్మారెడ్డి, కూరాకుల భారతి, మట్టెవాడ సీఐ కరుణాకర్ పాల్గొన్నారు.


