హన్మకొండ: డిజిటలైజేషన్, పునరుత్పాదక ఇంధనం ద్వారా విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ నోవాటెల్‌లో మంగళవారం నిర్వహించిన ఇండియా ఎనర్జీ సమ్మిట్ – ఎక్స్‌పో 2026 కార్యక్రమంలో ‘మోడర్నయిజింగ్ ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్మార్ట్ గ్రిడ్స్ ఫర్ ఎ రిలయబుల్ పవర్ ఫ్యూచర్’’ అనే అంశంపై కర్నాటి వరుణ్ రెడ్డి ప్రసంగించారు. ఐఏఎస్ సంస్థలో అమలు చేస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు, నెట్‌వర్క్ మ్యాపింగ్, స్మార్ట్ మీటరింగ్ కార్యక్రమాలను వివరించారు. సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ చేతుల మీదుగా జ్ఞాపిక, సావనీర్ అందుకున్నారు.
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 21వ తేదీన వరంగల్ జిల్లాస్థాయి అండర్–14, 16, 18, 20 బాలబాలికల అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కిషన్, యుగేంధర్‌రెడ్డి మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 26, 27 తేదీల్లో జేఎన్‌ఎస్‌లో జరగనున్న 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం లేదా పదో తరగతి మెమోతో హాజరుకావాలని వారు సూచించారు. పూర్తి వివరాలకు 9866564422, 9000354465 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
కాజీపేట రూరల్: కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో డోర్నకల్–గుండ్రాతిమడుగు మధ్య మూడో లైన్ నిర్మాణం కారణంగా కాజీపేట జంక్షన్ మీదుగా నడిచే చర్లపల్లి–షాలిమార్ (18046) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను బుధవారం వయా పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా దారి మళ్లించి నడిపిస్తున్నట్లు మంగళవారం రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని కోరారు.
హన్మకొండ అర్బన్: జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద ల్యాబ్ టెక్నీషియన్‌్ ఒకటి, సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్ రెండు పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్ప య్య తెలిపారు. కలెక్టర్ అనుమతితో ఈ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసినట్లు పేర్కొన్నారు. వీటిలో ఒకటి జనరల్, మరొకటి ఎస్సీ కేటగిరీకి కేటాయించారని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 19వ తేదీ ఉదయం 10.30 నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు హనుమకొండ కలెక్టరేట్‌లోని వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వివరాల కోసం హనుమకొండ జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని పేర్కొన్నారు.
నయీంనగర్: భద్రకాళి బండ్‌పై సందర్శకుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనం సేవలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మంగళవారం ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. అనంతరం ఆ వాహనంలో నాయినితోపాటు, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, బల్దియా కమిషనర్ వెంకన్న, కుడా సీపీఓ అజిత్‌రెడ్డి ప్రయాణించారు. కెనరా బ్యాంకు ఫాతిమానగర్ బ్రాంచ్ తన సీఎస్‌ఆర్ నిధుల కింద ఈ బ్యాటరీ వాహనం కొనుగోలు చేసి కుడాకు అందించింది. కార్యక్రమంలో కుడా ఈఈ భీంరావు, కెనరా బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.


