పాపన్నను స్ఫూర్తిగా తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పాపన్నను స్ఫూర్తిగా తీసుకోవాలి

Aug 19 2026 12:42 AM | Updated on Aug 19 2026 12:42 AM

పాపన్నను స్ఫూర్తిగా తీసుకోవాలి

హన్మకొండ అర్బన్‌: సామాజిక సమానత్వం, బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ చేసిన పోరాటాన్ని నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు సూచించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో మంగళవారం సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి నిర్వహించారు. ఎమ్మెల్యే నాగరాజు, హను మకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, అదనపు కలెక్టర్‌ రవి, అధికారులు పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘కుడా’ మాజీ చైర్మన్‌్‌ సుందర్‌రాజ్‌యాదవ్‌, బీసీ సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణ్‌, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

పాపన్నగౌడ్‌ జీవితం ఆదర్శం : ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జీవితం అందరికీ ఆదర్శమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అన్నారు. మంగళవారం వరంగల్‌ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారదతో కలిసి పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ. గణేశ్‌, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, బీసీ సంక్షేమశాఖ అధికారి పుష్పలత, గౌడ సంఘం నాయకులు రాజుగౌడ్‌, రమేశ్‌, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్‌ సత్యశారదతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు సమీక్ష నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement