బుధవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2026

Aug 19 2026 1:30 AM | Updated on Aug 19 2026 1:30 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

వేధిస్తున్న రెగ్యులర్‌ అధ్యాపకుల కొరత

– 8లోu

ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ అటానమస్‌, గురుకుల

డిగ్రీ కళాశాలలు

241

పీజీ కళాశాలలు

62

ఫార్మసీ 24

ఇంజనీరింగ్‌

06

బీఈడీ 43

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌

03

ఎంసీఏ 10

ఎంబీఏ 22

హోటల్‌

మేనేజ్‌మెంట్‌

03

లా 04

కేయూ పరిధిలోని

కొత్తగూడెం

ఇంజనీరింగ్‌

కళాశాలను

మన్మోహన్‌సింగ్‌ ఎర్త్‌

వర్సిటీగా మార్చారు.

కేయూ క్యాంపస్‌:

కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవ శోభ సంతరించుకుంది. నిత్య చైతన్య దీప్తిగా ఉంటూ లక్షలాది మంది విద్యార్థులను అక్షర దివిటీలుగా తీర్చిదిద్దిన ఘనచరిత్ర ఈ యూనివర్సిటీది. సామాజిక ఉద్యమాలు, పోరాటాల గడ్డగా పేరొందింది. బుధవారంతో యూనివర్సిటీ 50 వసంతాలు (గోల్డెన్‌ జూబ్లీ) పూర్తి చేసుకొని 51వ వసంతంలోకి అడుగిడుతోంది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ప్రస్థానంతోపాటు స్థానికంగా నెలకొన్న సమస్యలపై ప్రత్యేక కథనం.

కేయూ తొలుత పీజీ సెంటర్‌గా

తొలుత ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెంటర్‌గా 1968లో మొదలైంది. నాడు పోరాటాల ఫలితంగానే 1976 ఆగస్టు 19న కాకతీయ యూనివర్సిటీగా ఆవిర్భవించింది. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ 50 వసంతాల్లో ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసించి వివిధ రంగాల్లో, దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. ఇక్కడే ఆచార్యులు అయినవారూ ఉన్నా రు. మొదట కేయూ నాలుగు విభాగాలతో మొదలై నాడు రేకుల షెడ్లలోనే విద్య కొనసాగింది. అంచ లంచెలుగా ఎదిగి 29 విభాగాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం యూనివర్సిటీలోని అన్ని కాలేజీల్లో 1.20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.

కేయూలో వివిధ సెంటర్లు

కాకతీయ యూనివర్సిటీలో అంబేడ్కర్‌ స్టడీస్‌ సెంటర్‌, స్టూడెంట్‌ వెల్ఫేర్‌, ఎస్సీ, ఎీస్టీ సెల్‌, బీసీసెల్‌, దివ్యాంగసెల్‌, మహిళా అధ్యయన కేంద్రం, యోగా సెంటర్‌ ఉన్నాయి. వీటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. విద్యతోపాటు జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డిగ్రీ, జూనియర్‌, పీజీ కళాశాలల్లో కలిపి 360 ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లు ఉండగా అందులో 36వేల మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు ఉన్నారు. రక్తదానంలో అనేక అవార్డులు పొందింది. స్పోర్ట్స్‌బోర్డు కూడా ఉంది. ప్రతీఏటా సౌత్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ, ఆల్‌ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీల వివిధ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి పంపిస్తున్నారు.

నిధుల మంజూరుపై ఆశలు

యూనివర్సిటీ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటు న్న వేళ.. మౌలిక సదుపాయల కల్పనకు రూ.400 కోట్ల నిధుల కోసం వీసీ ప్రతాప్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆనిధులు మంజూరు చేస్తే యూనివర్సిటీలో గోల్డెన్‌జూబ్లీ, యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే యోచనలో ఉన్నారు.

కేయూ పరిధిలోని కాలేజీలు

గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు

తొలుత ఓయూ పీజీ సెంటర్‌గా ఆ తర్వాత కేయూ

నాలుగు విభాగాలతో మొదలై నేడు 29 విభాగాలు

యూనివర్సిటీ అభివృద్ధికి

రూ.400 కోట్లతో ప్రతిపాదనలు

కాకతీయ యూనివర్సిటీకి 50 వసంతాలు పూర్తి

కేయూలో 332 అధ్యాపక పోస్టులు ఖాళీ

బోధన, పరిశోధనలపై ప్రతికూల ప్రభావం

విద్యార్థులకు సరిపడా హాస్టళ్లు ఏవీ?

స్వర్ణోత్సవం భవిష్యత్‌కు బలమైన పునాది

కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవం గతానికి గర్వకారణం భవిష్యత్‌కు బలమైన పునాది. విద్య, నాణ్యమైన పరిశోధనల దిశగా కృషి చేస్తున్నాం. రూసా ప్రాజెక్టు కింద రూ.60 కోట్ల నిధులు రాగా, రూ.35 కోట్లతో 42 పరిశోధన ప్రాజెక్టులు, రూ.15 కోట్లతో కెహబ్‌ అభివృద్ధి చేస్తున్నాం. బీఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించి అండర్‌గ్రౌండ్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ ప్రాజెక్టు పూర్తయ్యింది. అకడమిక్‌ బ్లాక్‌లు, వర్క్‌షాప్‌లు,సెమినార్‌ హాల్స్‌, స్వర్ణోత్సవ శతాబ్ది పైలాన్‌ తదితర పనులకు ఆమోదం లభించింది. రూ.400 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇవి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. 50 ఏళ్ల విద్యాప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం.

– కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement