శిలాఫలకాలు, సర్క్యులర్లకే పరిమితం..! | - | Sakshi
Sakshi News home page

శిలాఫలకాలు, సర్క్యులర్లకే పరిమితం..!

Aug 19 2026 12:42 AM | Updated on Aug 19 2026 12:42 AM

శిలాఫలకాలు, సర్క్యులర్లకే పరిమితం..!

న్యూశాయంపేట: హజ్‌యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం మైనార్టీలకు ఉపయోగపడుతుందనే కోణంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్రంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సాధారణ ఎన్నికలకు ముందు వరంగల్‌ నగరంలో రూ.5 కోట్ల వ్యయంతో హౌజ్‌హౌస్‌ నిర్మాణానికి ప్రతిపాదించారు. అంతేకాకుండా హనుమకొండలో రూ.5కోట్ల వ్యయంతో షాదీఖానా నిర్మాణానికి శిలాఫలకాల ఆవిష్కరణ, సర్క్యులర్ల జారీ చకచకా జరిపోయాయి. నాయకుల ప్రకటనలు, అధికారులు వేసిన అంచనాలు చివరికి కాగితాలకే పరిమితమయ్యాయి. వరంగల్‌లో హజ్‌హౌస్‌ కోసం వరంగల్‌ రైల్వేస్టేషన్‌ ఎదురుగా సర్వే నంబర్‌ 10లో 1,400 గజాల స్థలం కేటాయిస్తున్నామని సర్క్యులర్‌ జారీ చేశారు. మండిబజార్‌ జెండా వద్ద అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ శిలాఫలకాన్ని సైతం ఆవిష్కరించారు. తర్వాత నిధుల విడుదలలో జాప్యం, పాలక వర్గాల నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగలేదు. కాగా, ఈ స్థలాన్ని ప్రస్తుతం వేరే ప్రైవేట్‌ వ్యక్తులకు కేటాయించినట్లు సమాచారం.

హనుమకొండలో పేద, మధ్య తరగతి మైనార్టీ కుటుంబాల శుభకార్యాలు, వివాహాలు జరుపుకునేందుకు 2023లో అప్పటి ప్రభుత్వం న్యూశాయంపేటలోని 579 సర్వే నంబర్‌లో సుమారు 25 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది. నాటి మంత్రి కేటీఆర్‌ లష్కర్‌బజార్‌లో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధి కారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మాణానికి భూమి అనువుగా లేదని కుడా నిధులతో భద్రకాళి చెరువు మట్టిని నింపి వేరే ప్రజోపయోగ కార్యక్రమానికి వినియోగించుకోవాలని భూ కేటాయింపుని రద్దు చేసింది. కాగా, ఇటీవల బీఆర్‌ఎస్‌ ఆందోళనలతో అదే భూమిని షాదీఖానాకు కేటాయించారు.

ములుగురోడ్డులో

గుసూల్‌ ఖానా..

నగరంలో అద్దె ఇళ్లలో నివసించే కుటుంబాలకు మృతదేహానికి గుసూల్‌ నిర్వహించడానికి సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇస్లాం ఆచారం ప్రకారం మరణించిన వారి అంతిమ సంస్కారాల్లో భాగంగా పవిత్రస్నానం చేయించి, ఖన నం చేయడానికి రూ.20 లక్షలతో ములుగురోడ్డులోని ఖబ్రస్థాన్‌లో గుసూల్‌ఖానా, స్నానపు గదులు, మరుగుదొడ్ల నిర్మాణానికి 2023లో అప్పటి మంత్రి మహమూద్‌ అలీ శంకుస్థాపన చేశారు. పిల్లర్ల వరకు నిర్మాణం పూర్తయ్యింది. అనంతరం పట్టించుకోకుండా వదిలేశారు.

నగరంలో నిర్మాణానికి

నోచుకోని హజ్‌హౌస్‌, షాదీఖానా

మండిపడుతున్న మైనార్టీ సంఘాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement