హనుమకొండ అదనపు కలెక్టర్ రవి
హన్మకొండ అర్బన్ : బాలల సంరక్షణ కేంద్రాల్లో పిల్లల భద్రత, సంక్షేమం, ఆరోగ్యం, విద్య, వసతి, ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రవి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా తనిఖీ కమిటీ సమావేశం జరిగింది. గత త్రైమాసిక తనిఖీల్లో గుర్తించిన లోపాలు, సూచనలపై సమీ క్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించి తీసుకున్న చర్యల నివేదికలను సమర్పించాలని కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, బాలల సంక్షేమ సమితి సభ్యుడు దామోదర్ పాల్గొన్నారు.


