● హాజరైన 495 మంది అథ్లెట్లు
వరంగల్ స్పోర్ట్స్: అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన నేషనల్ అథ్లెటిక్స్ సిరీస్–13 ఉత్సాహంగా సాగింది. ఒక్కరోజు పోటీల్లో భాగంగా క్రీడలు ఉదయం ప్రారంభమై సాయంత్రం 6గంటలకు ముగిశాయి. మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 495 మంది అథ్లెట్లు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. 12 ఈవెంట్లలో పోటీలు నిర్వహించగా విజేతల జాబితాను అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆన్‌లైన్‌లో అందించనున్నట్లు తెలిపారు. సర్టిఫికెట్లు సైతం ఆన్‌లైన్‌లోనే తీసుకోవాలని సూచించారు.


