ప్రాణం తీసిన విడాకుల పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన విడాకుల పంచాయితీ

Aug 19 2026 12:42 AM | Updated on Aug 19 2026 12:42 AM

వ్యక్తి దారుణ హత్య..రాంపూర్‌లో ఘటన

ధర్మసాగర్‌: కూతురు విడాకు ల పంచాయితీ తండ్రి ప్రా ణం తీసింది. కక్షలను మనసులో ఉంచుకుని ఓ వ్యక్తిని పథకం ప్రకారం దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ పీఎస్‌ పరిధిలోని కాజీపేట మండలం రాంపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రానికి చెందిన పోలు వెంకటేశ్వర్లు (వెంకన్న)(45) రెండో కుమార్తెకు, వారి పక్క ఇంటికి చెందిన అంబటి వినయ్‌తో నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. అయితే మనస్పర్థల కారణంగా కొద్దిరోజులకే వారికి విడాకులయ్యాయి. ఆ సమయంలో జరిగిన పంచాయితీలో వినయ్‌ తండ్రి పరమేశ్వర్‌.. వెంకటేశ్వర్ల్లుపై దాడికి యత్నించగా స్థానిక పెద్దమనుషులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 7:45 గంటల ప్రాంతంలో వెంకటేశ్వర్లు తన కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఈ సమయంలో పల్లె గ్రామానికి చెందిన దామర సంపత్‌ వచ్చి పరమేశ్వర్‌తో ఉన్న గొడవను మాట్లాడుకుందామని చెప్పి వెంకటేశ్వర్లును బయటకు తీసుకెళ్లాడు. రాత్రి 11:30 గంటలైనా వెంకటేశ్వర్లు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సంపత్‌కు ఫోన్‌ చేయగా గ్రామ పంచాయతీ వద్ద దింపేశానని చెప్పి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రాంపూర్‌ ఊర చెరువు మత్తడి వద్ద వెంకటేశ్వర్లు గొంతు కోసి రక్తం మడుగులో చనిపోయి ఉన్నట్లు గ్రామస్తులకు సమాచారం అందింది. ఈఘటనపై పథకం ప్రకారమే పరమేశ్‌, సంపత్‌ కలిసి తన భ ర్త వెంకటేశ్వర్లును కత్తితో నరికి హత్య చేశారని మృతుడి భా ర్య రాజమణి ధర్మసాగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశా రు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వెంకటేశ్వర్లు అంత్యక్రియలు పూర్తి..

చిల్పూరు: రాంపూర్‌ వద్ద సోమవారం అర్ధరాత్రి హత్యకు గురైన పోలు వెంకటేశ్వర్లు (45) దహన సంస్కారాలు మంగళవారం సాయంత్రం స్వగ్రా మం చిల్పూరులో పూర్తయ్యాయి. జనగామ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ రెడ్డి, ఎస్సై నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు నిర్వహించగా కుటుంబీకులు వెంకటేశ్వర్లు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, వెంకటేశ్వర్లు స్టేషన్‌ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌ పంప్‌ హౌజ్‌ వద్ద వాచ్‌మెన్‌గా విధులు నిర్వర్తించేవారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement