వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో జోరుగా జూదం | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో జోరుగా జూదం

Aug 8 2026 1:17 AM | Updated on Aug 8 2026 1:17 AM

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో జోరుగా జూదం – 8లోu

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2026

కమిషనరేట్‌లో

పేకాట కేసులు ఇలా..

వరంగల్‌ క్రైం: ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, హోటళ్లు పేకాట శిబిరాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు నగరం చుట్టు పక్కల జోరుగా సాగిన జూదం ఇప్పుడు ట్రైసిటీలో విచ్చలవిడిగా కొనసాగుతోందనే ఆరోపణలున్నాయి. టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌, పోలీస్‌స్టేషన్లకు కూత వేటు దూరంలో పేకాడుతూ పట్టుబడిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వం నిషేధించిన పేకాట జోరుగా సాగుతుంటే స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ట్రైసిటీ పరిధిలో చీకటి వ్యాపారాలతో పాటు జూదం శిబిరాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నాయనే వాదనలున్నాయి ఒక్క జూలై నెలలోనే పేకాట శిబిరాలపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు జరిపిన దాడుల్లో ఆరు శిబిరాల్లో పేకాట రాయుళ్లు పట్టుబడడం గమనార్హం. ఈనెలలో ఒకే రోజు రెండు శిబిరాల్లో పేకాట రాయుళ్లు పట్టుబడడంతో పాటు పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. దీన్ని బట్టి కమిషనరేట్‌ పరిధిలో ఏ స్థాయిలో పేకాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

విజిబుల్‌ పోలీసింగ్‌ ఎక్కడ?

‘ట్రైసిటీలోని ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 24 గంటలు పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు’. ఇది పదే పదే పోలీస్‌ ఉన్నతాధికారులు చెప్పే మాట. కానీ, చీకటి వ్యాపారాలు, పేకాట శిబిరాలు ఎక్కడా ఆగట్లేదనే ఆరోపణలున్నాయి. ఇలాంటి దందాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకుంటే తప్ప స్థానిక పోలీసులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో షిఫ్టుల వారీగా బ్లూకోల్ట్‌ సిబ్బంది విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహిస్తూ ముందస్తుగా ఆయా ఏరియాల్లో ఏం జరుగుతుందో సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. నిత్యం గస్తీ నిర్వహిస్తున్న బ్లూకోల్ట్‌ సిబ్బందికి, పెట్రోలింగ్‌ సిబ్బందికి ఇలాంటి పేకాట శిబిరాలు ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ట్రైసిటీ పరిధి పోలీస్‌ స్టేషన్లు భూ పంచాయితీలు, సెటిల్‌మెంట్లకు ప్రాధాన్యం ఇస్తూ పేకాట శిబిరాల్ని విస్మరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

2026

(ఆగస్టు 6 వరకు)

2025

2024

గత నెలలో ఆరు చోట్ల దాడులు

పట్టుబడుతున్న బడా బాబులు

పోలీస్‌ స్టేషన్లకు కూత వేటు దూరంలో పేకాట శిబిరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement