నేత కళాకారులకు అవార్డులు | - | Sakshi
Sakshi News home page

నేత కళాకారులకు అవార్డులు

Aug 8 2026 1:17 AM | Updated on Aug 8 2026 1:17 AM

నేత కళాకారులకు అవార్డులు

కాశిబుగ్గ: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డుకు ఓరుగల్లుకు చెందిన నేత కళాకారులు గోరంట్ల రాజు, కంచ సమత ఎంపికయ్యారు. ఈనేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన చేనేత దినోత్సవ వేడుకలను చేనేత జౌళిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సవ్యసాచి గోష్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయత్‌రాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క, చేనేత కార్పొరేషన్‌ చైర్మన్‌ దూడం వెంకటరమణ, వైస్‌ చైర్మన్‌ జక్కని అనిత చేతుల మీదుగా కళాకారులకు అవార్డులు అందజేసినట్లు టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిప్ప వెంకటేశ్వర్లు తెలిపారు. అవార్డు కింద రూ.25వేల నగదు, మెమొంటో, ప్రశంస పత్రంతో పాటు సన్మానించినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement