పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి | - | Sakshi
Sakshi News home page

పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి

Jul 11 2026 6:49 AM | Updated on Jul 11 2026 6:49 AM

పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి

కాళోజీ సెంటర్‌: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని టీఎస్‌సీపీఎస్‌ఈయూ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు కొంపెల్లి రవీందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని శంభునిపేట ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని నిరసిస్తూ ఈనెల 11న భద్రాద్రి జిల్లాలో మొదలు కానున్న జన జాగరణ యాత్ర వాల్‌ పోస్టర్‌ ఆవిషరించారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 11 నుంచి 30వ తేదీ వరకు జరిగే ర్యాలీ ఈ నెల 29న వరంగల్‌ జిల్లాకు చేరుకుంటుందని, ర్యాలీలో జిల్లాలోని ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రఘు, జిల్లా కార్యవర్గ సభ్యులు వివేకానంద, శ్రీనివాస్‌, రాజ్‌కుమార్‌, రఘు, నవీన్‌ దేవరాజ్‌, అశోక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement