ఆధార్‌ బయోమెట్రిక్‌ నవీకరణ పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆధార్‌ బయోమెట్రిక్‌ నవీకరణ పూర్తి చేయాలి

Jul 11 2026 6:49 AM | Updated on Jul 11 2026 6:49 AM

ఆధార్‌ బయోమెట్రిక్‌ నవీకరణ పూర్తి చేయాలి

కాళోజీ సెంటర్‌: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఆధార్‌ బయోమెట్రిక్‌ నవీకరణ త్వరగా పూర్తి చేయాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ అన్నారు. శుక్రవారం నగరంలోని కృష్ణా కాలనీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆధార్‌ నవీకరణ కేంద్రం నిర్వహిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధారించిన తేదీల్లోగా విద్యార్థుల బయోమెట్రిక్‌ (వేలి ముద్రలు), ఐరిష్‌, అడ్రస్‌ తదితర వివరాలను నవీకరించుకోవాలన్నారు. అనంతరం కళాశాలలో జరుగుతున్న తరగతులను పరిశీలించారు. పలువురు నూతన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శరదృతి, లైబ్రేరియన్‌ వనమాల, అధ్యాపకులు శర్మ, హరికృష్ణ, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement