ప్రతిపాదనలు సిద్ధం చేయండి | - | Sakshi
Sakshi News home page

ప్రతిపాదనలు సిద్ధం చేయండి

Jul 11 2026 6:49 AM | Updated on Jul 11 2026 6:49 AM

ప్రతిపాదనలు సిద్ధం చేయండి

బల్దియా కమిషనర్‌ టి.వెంకన్న

వరంగల్‌ అర్బన్‌: జంతు వధశాలల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని బల్దియా కమిషనర్‌ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాజీపేట, హనుమకొండలోని జంతు వధశాలలను కమిషనర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆదేశాలిచ్చారు. హనుమకొండ ప్రెస్‌ క్లబ్‌ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరంగల్‌లోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. అనంతరం నక్కలగుట్ట వార్డు కార్యాయాలన్ని తనిఖీ చేశారు. అనంతరం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, అర్బన్‌ మలేరియా విభాగ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎస్‌ఈ రాజ్‌కుమార్‌, సీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజేశ్‌, శానిటరీ సూపర్‌వైజర్లు భాస్కర్‌, నరేందర్‌, గోల్కొండ శ్రీను, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ మధుకర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

పోస్టర్ల ఆవిష్కరణ

అభ్యుదయ సేవా సమితి, స్వచ్ఛ వరంగల్‌ పౌర సంఘాల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో గ్రేటర్‌ వరంగల్‌లో సెప్టిక్‌ ట్యాంకుల క్రమబద్ధమైన డిస్లడ్జింగ్‌పై అవగాహన పోస్టర్లను కమిషనర్‌ టి.వెంకన్న ఆవిష్కరించారు. కార్యక్రమంలో అభ్యుదయ సేవా సమితి అధ్యక్షులు మండల పరశురాములు, సెప్టిక్‌ ట్యాంక్‌ వాహన యజమానులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement