వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: శ్రీనిధి ద్వారా మహిళలకు అందించే రుణాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ హాల్‌లో శ్రీనిధి కార్యక్రమం అమలు, రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వైవీ.గణేశ్, శ్రీనిధి జోనల్ ఆఫీసర్ ఎస్‌ఎన్.ఆర్‌ఎం.సైదిరెడ్డి, రజిత, ఏపీఎంలు, డీపీఎంలు, తదితరులు పాల్గొన్నారు.
‘ఎస్‌ఐఆర్’ను వేగవంతం చేయాలి
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ డాక్టర్ పవన్‌కుమార్ శర్మ ఆదేశించారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ. గణేశ్, ఆర్డీఓలు సుమా, ఉమారాణి, ఎన్నికల సూపరింటెండెంట్ రజనీ, అధికారులు పాల్గొన్నారు.


