అసంపూర్తి పనులతో | - | Sakshi
Sakshi News home page

అసంపూర్తి పనులతో

Jul 10 2026 9:39 AM | Updated on Jul 10 2026 9:39 AM

అసంపూర్తి పనులతో – 8లోu

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2026

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌లోని నర్సంపేట ప్రధాన రహదారిలో జరుగుతున్న గ్యాస్‌ పైప్‌లైన్‌ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వరంగల్‌ నగర శివారు నుంచి గొర్రెకుంట క్రాస్‌ రోడ్డు, లేబర్‌ కాలనీ, మిల్స్‌ కాలనీ, వెంకట్రామా జంక్షన్‌, కాశిబుగ్గ, పోచమ్మ మైదాన్‌, ఎంజీఎం సెంటర్‌ నుంచి ఎంజీఎం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వరకు గ్యాస్‌ పైప్‌లైన్‌ను ఓ ప్రైవేట్‌ ఏజెన్సీ సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రధాన రహదారిని ఆర్‌అండ్‌బీ పర్యవేక్షిస్తోంది. సుమారు ఆరు నెలల పాటు ఎండలు మండిపోయాయి. ఇంతకాలం నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు ఏజెన్సీ నిర్వాహకులు నర్సంపేట రోడ్డు నుంచి పోచమ్మమైదాన్‌ జంక్షన్‌ వరకు రెండు నెలలుగా గ్యాస్‌ పైప్‌లైన్ల కోసం భారీ గుంతలు తవ్వుతున్నారు.

30 మీటర్లకో గుంత..

రోడ్డంతా కాకపోయిన సుమారు 30 మీటర్లకో చోట భారీ గుంతలు తవ్వి అండర్‌ గ్రౌండ్‌ ద్వారా పైప్‌లైన్లు వేస్తున్నారు. గ్యాస్‌ పైపులైన్లు వేయాల్సిందే... కానీ, అసలే వర్షాకాలం 30 మీటర్లకో చోట భారీ గుంత తవ్వడం, అసంపూర్తిగా పూడ్చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. తవ్వకాలు జరిగే చోట పైప్‌లైన్లు, ఇతర కేబుల్స్‌ అడ్డు రావడంతో తాత్కలిక ప్రమాద హెచ్చరికల రిబ్బన్లు ఏర్పాటు చేస్తున్నారు. రిబ్బన్లు గాలికి కొట్టుకుపోతున్నాయి. రోడ్డుకు ఒకవైపు సగానికి పైగా తవ్వకాలు జరుపుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విపరీతమైన ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. అక్కడక్కడా ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఎవరిది ఈ నిర్లక్ష్యం?

ఈ పనులపై సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భారీగా తవ్విన గుంతల్లో మట్టి ౖపైపెన పూడ్చేసి చేతులు దూలుపుకుంటున్నారు. మట్టి కుంగిపోయి రోడ్డుపై గుంతలు ఏర్పడుతున్నాయి. అసలే వర్షాకాలం కావడం వల్ల భారీ వర్షం కురిస్తే లోతైన గుంతలు వరద నీటితో నిండిరోడ్డు, గుంత తెలియక ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. ఈ రోడ్డు మార్గం నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది. బాటసారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాకపోకలు సాగిస్తున్నారు. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ ఇంజనీర్లను సంప్రదిస్తే స్పదించడం లేదు. బల్దియా ఇంజనీర్లు మాత్రం చూస్తాం.. చేస్తామని కాలయాపన చేస్తుండడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

త్వరగా పూర్తి చేయిస్తాం..

వరంగల్‌లోని నర్సంపేట రోడ్డులో అండర్‌ గ్రౌండ్‌ ద్వారా గ్యాస్‌ పైపులైన్లు వేసేందుకు అనుమతి ఉంది. పనుల్లో నిర్లక్ష్యం లేకుండా ఆదేశాలు ఇస్తాం. గుంతలు తవ్విన చోట పక్కాగా ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం.

– సంతోశ్‌, బల్దియా ఈఈ

వరంగల్‌లోని నర్సంపేట నడి రోడ్డుపై తవ్విన

భారీ గుంత

ప్రధాన రహదారిపై

తవ్విన భారీ గుంతలు

వర్షాకాలం నీరునిలిచి

ప్రమాదం జరిగే అవకాశం

పట్టించుకోని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement