మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
సాక్షిప్రతినిధి, వరంగల్ :
వరంగల్ నగరంలో భూసెటిల్‌మెంట్లు, దందాలు మళ్లీ సాధారణంగా మారాయన్న చర్చ జరుగుతోంది. వివాదాస్పద భూములపై కన్నేసిన కొందరు సంబంధిత వ్యక్తులను సంప్రదించి సెటిల్‌మెంట్లకు దిగుతున్నారనే ప్రచారం ఉంది. కేవలం భూదందాల ద్వారా అక్రమార్జన చేసేందుకు కొందరు కూటమిగా ఏర్పడి చేస్తున్న ఈ వ్యవహారం నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది. జనతా గ్యారేజీ తరహాలో హనుమకొండ నందిహిల్స్ ఏరియాలో ఓ ఆఫీసు నిర్వహిస్తుండడం.. సెటిల్‌మెంట్ల సమయంలో కడప జిల్లా జమ్మలమడుగు గ్యాంగ్‌గా కొందరిని చూపడం వంటి కార్యక్రమాలకు పాల్పడుతుండడం ఆ నోటా ఈ నోటా నగరంలో పాకింది. గ్రేటర్ వరంగల్ నగరం చుట్టూ ఉన్న మడికొండ, ధర్మసాగర్, హసన్‌పర్తితోపాటు శివారు గ్రామాలు, నగరంలోని భూసమస్యలున్న వారిని సంప్రదించి సెటిల్‌మెంట్లు చేస్తుండడం.. మొత్తం ఈ వ్యవహారం వెనుక వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో లూప్‌లైన్‌లో పనిచేస్తున్న ఓ ఇన్‌స్పెక్టర్ పాత్ర కూడా ఉందన్న ప్రచారం జరిగింది.
‘జమ్మలమడుగు’
గ్యాంగ్ పేరుతో..
ఎక్కడ భూ వివాదాలు ఉంటాయో అక్కడ వాలిపోయి సెటిల్‌మెంట్లకు దిగడం.. ఎదుటి పక్షం వారు వినకపోతే ‘జమ్మలమడుగు’ గ్యాంగ్ పేరును వాడుతున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దీంతో భూ వివాదాలు ఉన్న పలువురు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఈ బృందాన్ని సంప్రదించినట్లు చెబుతున్నారు. ఏకంగా ప్రైవేట్ ఆఫీసును తెరవడంతోపాటు బహిరంగంగానే సెటిల్‌మెంట్లకు దిగుతున్న వైనంపై ఇటీవల ఇటు పోలీసు వర్గాలు.. అటు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసు నిఘా వర్గాలు భూదందాలు, సెటిల్‌మెంట్లపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. కాగా, నగరంలో ఇటీవల జరిగిన భూ సెటిల్‌మెంట్ దందా ప్రచారంలో వాస్తవం ఎంత? ఆ దందాతో ప్రమేయమున్నట్లు ప్రచారం జరుగుతున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎవరు? ఇంకా ఎవరెవరరి పాత్ర ఉంది? అన్న కోణాల్లో ఆరా తీస్తుండడం పోలీసువర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
వివాదాస్పద
భూములపై కన్ను
డాక్యుమెంట్లు రాబట్టి సెటిల్‌మెంట్లు
దందాలో ఓ పోలీసు అధికారి
పాత్రపై చర్చ
రంగంలోకి పోలీసు నిఘా వర్గాలు
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026


