వెనువెంటనే మరమ్మతులు
జాతరలో బస్సుల వైఫల్యాలకు తావు లేదు
హన్మకొండ: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో ఆర్టీసీ బస్సుల వైఫల్యాలకు తావు లేకుండా టీ జీఎస్ ఆర్టీసీ యాజమాన్యం, అధికారులు అన్ని చ ర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చే స్తున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు నాలుగు రో జులపాటు జరిగే వనదేవతలు సమ్మక్క–సారలమ్మ జాతరకు ఈ నెల 21 నుంచి టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక ఖరారు చేసింది. 2022లో జరి గిన జాతరలో 2,800 బస్సులు నడిపారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన క్రమంలో ఈసారి మ హిళా భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. దీంతో 2024 జాతరలో 3,840 బస్సులు నడిపారు. ఈ జాతరలో భక్తులను వెనువెంటనే చేరవేయడానికి 4,860 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి బస్సులు సేకరిస్తున్నారు. ఈ నెల 21 నాటికి వరంగల్ రీజియన్‌కు బస్సులు చేరుకునేలా షెడ్యూల్ ఖరారు చేశారు.
ద్విచక్రవాహనాలతో ప్రత్యేక బృందాలు..
టీజీఎస్ ఆర్టీసీ బస్సులు మార్గమధ్యలో ఫెయిలైనా, ఇతర మరమ్మతులు వచ్చినా భక్తులు ఏమాత్రం అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు, బస్సులు నిలిచిపోకుండా ఉండేందుకు వెంటనే మరమ్మతులు చేసేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు మొబైల్ టీంలు ఏర్పాటు చేయడంతో పాటు మార్గమధ్యలో ప్రత్యేకంగా మెయింటెనెన్స్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండి నాలుగు చక్రాల వాహనాలు వెళ్లలేని పరిస్థితుల్లో సులువుగా చేరుకునేందుకు ద్విచక్రవాహనాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. జాతర రూట్‌లో మొత్తం 16 చేజింగ్, రిలీఫ్ మొబైల్ టీంలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక అధికారి, ఇద్దరు మెకానిక్‌లు ఉంటారు. అదేవిధంగా 11 రిలీఫ్ వ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఇద్దరు మెకానిక్‌లతోపాటు టైర్లు, విడిభాగాలు అందుబాటులో ఉంటాయి. బస్సు మార్గమధ్యలో ఫెయిలైతే ఈ వ్యాన్‌కు సమాచారం అందించిన వెంటనే చేరుకుని మరమ్మతు చేసి పంపుతారు. వీటితో పాటు 12 డీజీటీలను అందుబాటులో ఉండేల కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో ఇద్దరు మెకానిక్‌లు, ఒక ఎలక్ట్రీ షియన్ ఉంటారు.
ఆగిపోతే తక్షణమే రిపేర్ చేసేలా ఏర్పాట్లు
అందుబాటులో 16 ఛేజింగ్, రిలీఫ్ టీంలు,
11 వ్యాన్లు, నాలుగు మెయింటెనెన్స్ క్యాంపులు
ఈనెల 21 నుంచి మేడారానికి బస్సులు
నడిపేందుకు
ఆర్టీసీ యాజమాన్యం, అధికారుల కసరత్తు


