వందశాతం సబ్సిడీపై పంపిణీ
దళిత మహిళా రైతుల ఆదాయాన్ని పెంచడానికే కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఐసీఏఆర్ అటారీ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కింద మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా పెరటి కోడి పిల్లలను పంపిణీ చేస్తున్నాం. పెంపకంపై అవగాహన కల్పించి మహిళలకు ఆదాయ మార్గాలు చూపుతున్నాం. అభివృద్ధి చెందిన కోళ్ల జాతిలోని రాజశ్రీ, గ్రామ ప్రియ, వనరాజా, కడక్ నాథ్ పిల్లలను 100శాతం సబ్సిడీపై అందజేస్తున్నాం. దీంతో షెడ్యూల్ కులాల మహిళలు మంచి ఆదాయం పొందుతున్నారు.
– డాక్టర్ బిందు మాధురి,
కోఆర్డినేటర్, కేవీకే, వరంగల్


