ప్రజాఉద్యమాలతోనే సామాజిక మార్పు
కేయూ క్యాంపస్: ప్రజా ఉద్యమాలతోనే సామాజిక మార్పు సాధ్యమని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బి.ఎస్. రాములు అన్నారు. కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ విభాగం, తెలుగు విభాగం సంయుక్తంగా ‘తెలంగాణ చరిత్రలో ప్రజా ఉద్యమాలు 1969–2025’ అనే అంశంపై బుధవారం కేయూ సెనేట్‌హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యవక్తగా మాట్లాడారు. ప్రజా ఉద్యమాలు చైతన్య ప్రక్రియలన్నారు. అనంతరం కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ సమాజ హిత ఉద్యమాలను స్వాగతించాలన్నారు. ప్రజల అవసరాల నుంచి పుట్టినవే ఉద్యమాలన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య మనోహర్, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, తెలుగు విభాగం ఇన్‌చార్జ్ అధిపతి మామిడి లింగయ్య, కేయూ పాలకమండలి సభ్యుడు చిర్రరాజు, స్టూడెంట్స్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్లు సి.హెచ్ రాధిక, నిరంజన్, తెలుగు విభాగం అధ్యాపకులు సదాశివ్, బానోతు స్వామి పాల్గొన్నారు. కాగా, ప్రజా ఉద్యమాలు అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.
రాష్ట్ర బీసీ కమిషన్
మాజీ చైర్మన్ రాములు


