పెరటి కోళ్ల పెంపకం.. | - | Sakshi
Sakshi News home page

పెరటి కోళ్ల పెంపకం..

Jan 8 2026 6:19 AM | Updated on Jan 8 2026 6:19 AM

పెరటి కోళ్ల పెంపకం..

పెరటి కోళ్ల పెంపకం..

చక్కటి ఆదాయ మార్గం..

ఖిలా వరంగల్‌ : దళిత మహిళారైతుల ఆదాయ మార్గం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అటారీ షెడ్యూల్డ్‌ కులాల ఉప ప్రణాళిక అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ పథకం ద్వారా గ్రామీణ, నగర శివారు ప్రాంతాల్లో పెరటి కోడి పిల్లలు పంపిణీ చేస్తోంది. ఫలితంగా దళిత మహిళా రైతులు, ఇతర కుటుంబాలు నెలకు రూ.10 వేలు కంటే అధిక ఆదాయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పెరటికోళ్లలో రకాలు, పెంపకంతో వచ్చే ఆదాయంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కాగా, ఈ పథకంపై మామునూరు పీవీ నరసింహరావు పశువైద్య విశ్వవిద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రం అవగాహన కల్పిస్తోంది.

దశల వారీగా ఆదాయం..

నాటుకోడి ఏడాదికి మూడుసార్లు పొదుగుతుంది. నాలుగు నెలలకు ఒకసారి మూడు వారాల పాటు గుడ్డు పెడుతుంది. ఏడాదికి 40–45 కోడిగుడ్లు పె డుతుంది. పొదిగిన సమయంలో 12–15 గుడ్లు పె డుతుంది. ఇందులో 10–12 పిల్లలుగా రూపాంతరం చెందుతాయి. కోడి పొదుగు ప్రారంభించిన తర్వాత మూడు వారాల్లో గుడ్లు పిల్లలుగా రూపుదిద్దుకుంటాయి. ఒక కోడి ఏడాదికి 40 గుడ్లు పెడితే 36 పిల్లలుగా రూపాంతరం చెందుతాయని పశుసంవర్థశాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. 36 పిల్లలు కోళ్లుగా ఎదగడానికి రెండు నెలల సమయం పడుతుంది. ఒక్కొ నాటు కోడిని రూ.400 నుంచి 500 వరకు అ మ్ముతున్నారు. 14 పిల్లల్లో 50 శాతం ఆడ(పెట్ట లు ), 50 శాతం మగ (పుంజులు) ఉంటాయి. పెంప కం దారులు పుంజులు అమ్మి పెట్టలను పెంచుకుంటే దినదినాభివృద్ధి చెంది కోళ్లతోపాటు గుడ్లు సంఖ్య పెరిగి దశల వారీగా ఆదాయం పెరుగుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

కోళ్ల పెంపకం దారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోడికి రక్షణగా చిన్న గంప లేదా ఇనుప కుందెన ఏర్పాటు చేసుకుంటే కుక్కలు, పిల్లుల బెడద ఉండదు. మహిళలు, వృద్ధులు ఈ పెంపకంపై దృష్టి సారిస్తే ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని కేవీకే శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంటి ఆవరణ, ఖాళీ స్థలం చుట్టూ పెన్సింగ్‌ వేసి రక్షణ కల్పిస్తే వందల సంఖ్యలో కోళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లోని వ్యర్థ పదార్థాలను కోళ్లకు దాణాగా ఉపయోగించుకోవచ్చు. వైద్యుల సలహాలు తీసుకుంటే వ్యాధులు బారిన పడకుండా కోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

అభివృద్ధి చెందిన నాటుకోళ్ల గుడ్లు బరువు

50 నుంచి 60 గ్రాములు..

కోళ్లలో రెండు రకాలు ఉన్నాయి. నాటుకోళ్లు, అభివద్ధి చెందిన నాటుకోళ్లు. నాటు కోళ్ల ఏడాదికి మూడు సార్లు పొదుగుతుంది. నాలుగు నెలలకు ఒకసారి గుడ్లు పెడుతాయి. అభివృద్ధి చెందిన నాటుకోళ్లల్లో రాజశ్రీ, గ్రామ ప్రియ, వనరాజా, కడక్‌ నాథ్‌ వంటి రకాలు ఉన్నాయి. ఈ రకం కోళ్లు ఏడాదికి 180–240 గుడ్లు పెడుతాయి. ఈ రకం కోళ్లలో పొదిగే స్వభావం తక్కువ ఉంటుంది. రెండు నెలలు కోడిగుడ్లు పెడుతాయి. ఒక్కొక్క గుడ్డు బరువు 50 నుంచి 60 గ్రాములు ఉంటుంది.

యంత్రాల ద్వారా కోడి పిల్లల తయారీ..

అభివృద్ధి చెందిన కోళ్ల రకాలను మెరుగుపర్చడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ రకం కోళ్లు ఏడాదికి 180 నుంచి 240 గుడ్లు పెడుతాయి. తద్వారా రైతులకు అధిక ఆదాయం వస్తుంది. అందుకే కృత్రిమ కోడి పిల్లల తయారీపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి సక్సెస్‌ అయ్యారు. ఇంక్యుబేటర్‌ (పొదిగే యంత్రం)లో గుడ్లు పెడితే 21 రోజుల తర్వాత పిల్లలుగా రూపాంతరం చెందుతాయి. 21 రోజుల తర్వాత పిల్లలను బయటకు తీసి పెంచుకోవాలి. ఇంక్యుబేటర్‌ రూ.10వేలు నుంచి రూ.40 వేల వరకు ఉంది. చిన్న ఇంక్యుబేటర్‌లో 4 డజన్లు (48) పిల్లలు తయారయ్యే అవకాశం ఉంది.

దళిత మహిళారైతులకు

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేయూత

వందశాతం సబ్సిడీతో

కోడిపిల్లలు పంపిణీ

కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement