కాజీపేట మీదుగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాజీపేట మీదుగా సికింద్రాబాద్– సిర్పూర్‌కాగజ్‌నగర్, హైదరాబాద్ దక్కన్– విజయవాడ మధ్య 8 ప్రత్యేక రైళ్లను నపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ బుధవారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
సికింద్రాబాద్–సిర్పూర్‌కాగజ్ నగర్ మధ్య..
జనవరి 9, 10వ తేదీల్లో హైదరాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ (07469) ఎక్స్‌ప్రెస్, జనవరి 9, 18వ తేదీల్లో సిర్పూర్‌కాగజ్‌నగర్–హైదరాబాద్ (07470) ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తాయి. జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో ప్రయాణించే ఈ రైళ్లకు సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగిరి, ఆలేరు, జనగా మ, ఘన్‌పూర్, కాజీపేట, ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు.
హైదరాబాద్–విజయవాడ మధ్య..
జనవరి 9, 10వ తేదీల్లో హైదరాబాద్ దక్కన్–విజయవాడ (07471) ఎక్స్‌ప్రెస్, జనవరి 9, 18వ తేదీల్లో విజయవాడ–హైదరాబాద్ దక్కన్ (07472) ఎక్స్‌ప్రెస్ కాజీపేట, వరంగల్‌కు చేరుకుని వెళ్తాయి. జనరల్ సెకండ్‌క్లాస్ కోచ్‌లతో ప్రయాణించే ఈ రైళ్లకు సికింద్రాబాద్, చర్లపల్లి, జనగామ, ఘన్‌పూర్, కాజీపేట, వరంగల్, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు.
వరంగల్ మీదుగా ప్రత్యేక రైళ్లు..
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వరంగల్ మీదుగా చర్లపల్లి–తిరుచనూరు, చర్లపల్లి–తిరుచనూరు మధ్య రెండు వారాంతపు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు కాజీపేట రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. జనవరి 22వ తేదీన చర్లపల్లి–తిరుచనూరు (07140) వీక్లి ఎక్స్‌ప్రెస్, జనవరి 25వ తేదీన తిరుచనూరు–చర్లపల్లి (07141) వీక్లి ఎక్స్‌ప్రెస్ వరంగల్‌కు చేరుకుని వెళ్తాయి. ఈ రైళ్లకు బొల్లారం, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుంటూరు, నంద్యాల, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు.
సికింద్రాబాద్–సిర్పూర్‌కాగజ్‌నగర్ మధ్య
నాలుగు ట్రైన్లు
హైదరాబాద్ దక్కన్–విజయవాడ మధ్య నాలుగు..


