ముగిసిన పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు
వరంగల్: ప్రగతిశీల ప్రజాస్వా మ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) 23వ రాష్ట్ర మహాసభలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ప్రచురించిన ‘మళ్లీ డి టెన్షన్ గుది బండే’, ‘సంక్షోభంలో విద్యారంగం’ అనే రెండు పుస్తకాలను పీడీఎస్‌యూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడపంగి నాగరాజు గత మహాసభ నుంచి నేటి వరకు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమాల నివేదికలను హాజరైన సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహాసభల ఆహ్వాన సంఘం నాయకులు రాచర్ల బాలరాజు, గంగుల దయాకర్, ఎలకంటి రాజేందర్, బండి కోటేశ్వరరావుతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుర్రం అజయ్, మర్రి మహేశ్, తదితరులు పాల్గొన్నారు.


