వికారాబాద్–కాకినాడ టౌన్ ట్రైన్ రద్దు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా వికారాబాద్–కాకినాడ టౌన్ (07287) మధ్య ప్రయాణించే వీక్లి ఎక్స్‌ప్రెస్‌ను సాంకేతిక కారణాలతో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ఆపరేషనల్ రీజన్స్‌తో జనవరి 19వ తేదీన ప్రయాణించే ఈ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు వారు పేర్కొన్నారు.
బాలుడి కిడ్నాప్ కేసు
ఛేదనలో ముందడుగు..
● నిందితులు కారు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తింపు
కాజీపేట : కాజీపేట రైల్వే జంక్షన్ ఆవరణలో ఇటీవల కిడ్నాప్‌నకు గురైన బాలుడి కేసు ఛేదనలో ముందడుగు పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులకు క్లూ లభించినట్లు సమాచారం. హనుమకొండ జిల్లా వేలేరు మండలం కమ్మరిపేట తండాకు చెందిన లావుడ్య కన్నా నాయక్ దంపతులు గత 27వ తేదీన రాత్రి జంక్షన్ ఆవరణలో తమ ఐదు నెలల బాలుడితో కలిసి నిద్రించారు. ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో తల్లి పొత్తిళ్ల నుంచి దుండుగులు బాలుడిని అపహరించుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అలాగే, క్రైం, టాస్క్‌ఫోర్స్ పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
సీసీ కెమెరాల వడబోతలో లభించిన క్లూ..
పోలీసుల పది రోజులు ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు సమాచారం. బాలుడి కిడ్నాప్‌నకు నిందితులు కారు ను ఉపయోగించినట్లు పోలీసు బృందాలు నిర్ధారణ కు వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి 11 గంటల సమ యం నుంచే అనుమానిత కారు నాలుగైదు రౌండ్లు కాజీపేట రైల్వే జంక్షన్‌లో తిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆ కారులోనే బాలుడిని దాదాపు రాత్రి 2.30 గంటల సమయంలో తల్లి పొత్తిళ్ల నుంచి తీసుకుని పరారైనట్లు భావిస్తున్నారు. నిందితులతో పాటు కారును గుర్తించడానికి పోలీసు బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.


