సమస్యలపై స్పందించండి | - | Sakshi
Sakshi News home page

సమస్యలపై స్పందించండి

Jan 6 2026 8:04 AM | Updated on Jan 6 2026 8:04 AM

సమస్యలపై స్పందించండి

సమస్యలపై స్పందించండి

సమస్యలపై స్పందించండి

వరంగల్‌ అర్బన్‌: ‘సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని పలుమార్లు ఫిర్యాదులు చేశాం. క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు పట్టించుకోవట్లేదు. మీరైనా స్పందించి అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలి’ అని పలు కాలనీల ప్రజలు బల్దియా కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌కి విన్నవించారు. సోమవారం గ్రేటర్‌ వరంగల్‌ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆమె దరఖాస్తులు స్వీకరించారు. గ్రీవెన్స్‌కు అందిన ప్రతీ ఫిర్యాదుపై అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా సమస్యలు పరిశీలించి, పరిష్కరించాలని కమిషనర్‌ సూచించారు. గ్రీవెన్స్‌కు మొత్తం 90 ఫిర్యాదులు రాగా, అందులో.. టౌన్‌ ప్లానింగ్‌కు 45, ఇంజనీరింగ్‌ 22, రెవెన్యూ 15, హెల్త్‌ శానిటేషన్‌ 5, నీటి సరఫరా 2, హార్టికల్టర్‌–1 ఫిర్యాదులు అందినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌, ఎస్‌ఈ సత్యనారాయణ, సీహెచ్‌ఓ రమేశ్‌, డీఎఫ్‌ఓ శంకర్‌ లింగం, ఇన్‌చార్జ్‌ సిటీ ప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, టీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గ్రీవెన్స్‌కు అందిన ఫిర్యాదుల్లో కొన్ని..

● 42వ డివిజన్‌ రంగశాయిపేటలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని కాలనీవాసులు విన్నవించారు.

● హనుమకొండ గోపాల్‌పూర్‌ రోడ్డు 2, 3, 4, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని మాధవనగర్‌ కాలనీ అభివృద్ధి సంఘం ప్రతినిధులు విన్నవించారు.

● 57వ డివిజన్‌ కృష్ణ కాలనీలో రోడ్డు–2లో 60 ఫీట్ల రోడ్డు పొడవునా డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు.

● ఖిలావరంగల్‌ తిమ్మాపూర్‌ సర్వే నంబరు 124/2 విస్తీర్ణంలో 2 గుంటల భూమికి సంబంధించి కోర్టు కేసు నడుస్తున్నా భవన నిర్మాణానికి పర్మిషన్‌ జారీ చేశారని, చర్యలు తీసుకోవాలని బండారి సదానందం ఫిర్యాదు చేశారు.

● 26వ డివిజన్‌ మార్కండేయ వీధిలో రోడ్డును ఆక్రమించి ఇనుప మెట్లు నిర్మించారని, తొలగించాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.

● 36వ డివిజన్‌ చింతల్‌ సర్వే నంబర్‌ 367లో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మించాలని దళిత అభివృద్ధి సొసైటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

● బల్దియా శానిటేషన్‌ సిబ్బందికి చీపురు కట్టలు, శానిటేషన్‌ సామగ్రి అందించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సింగారపు బాబు కోరారు.

● విలీనగ్రామం టేకులగుడెం ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలకు నల్లా కనెక్షన్‌ ఇవ్వాలని హెడ్‌మాస్టర్‌ వినతిపత్రం అందించారు.

● హైకోర్టు ఆర్డర్‌ ఉన్నప్పటికీ సమత కో–ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.

● 3వ డివిజన్‌ లక్ష్మీకాంత్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌కు బదులు లక్ష్మీ గణపతి కాలనీగా గెజిట్‌లో పేరు నమోదు చేయాలని కాలనీవాసులు కోరారు.

● 3వ డివిజన్‌ శివాలయం వీధిలో నిలిచిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.

● హనుమకొండ యాదవనగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా షాపులు ఏర్పాటు చేసుకున్నారని చ ర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరారు.

సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించండి

ఆక్రమణలపై చర్యలు తీసుకోండి

గ్రేటర్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

బల్దియా గ్రీవెన్స్‌లో దరఖాస్తుల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement