సిటీ బ్యూటీకి కార్మికులే కీలకం
వరంగల్ అర్బన్: సిటీ బ్యూటీకి పారిశుద్ధ్య కార్మి కులే కీలకమని, వారి సేవలు వెలకట్టలేమని, అందుకోసం ఇక నుంచి కార్పొరేట్ వైద్య సేవలందుతాయని మేయర్ గుండు సుధారాణి అన్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పారిశుధ్య సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆరోగ్యవంతమైన కార్మికుల కోసం జీడబ్ల్యూఎంసీ, మెడికవర్ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని మేయర్, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ప్రారంభించారు. ఈనెల 5 నుంచి ఫిబ్రవరి 28 వరకు సుమారు 4 వేల మంది ఉద్యోగులు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, పారిశుద్ధ్య సిబ్బందికి మెడికవర్ ఆస్పత్రిలో అందించే వైద్య పరీక్షల సమాచార పోస్టర్‌ను మేయర్, కమిషనర్ ఆవిష్కరించారు. అనంతరం హెల్త్ కార్డులు పంపిణీ చేశారు.
పన్ను వసూళ్ల లక్ష్యం చేరుకోకపోతే చర్యలు
ఆస్తి, నీటి పన్నులకు సంబంధించిన బకాయిలను నిర్ణీత సమయంలో వసూలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. సోమవారం బల్దియా కార్యాలయంలో పన్నుల విభాగాధికారులు, సిబ్బందితో ఆమె సమీక్షించారు. బల్దియా పరిధి 63వ డివిజన్‌లో క్షేత్రస్థాయిలో సందర్శించి స్థానికంగా ఉన్న సమస్యలు మేయర్ పరిశీలించారు. స్థానిక కార్పొరేటర్ విజ్ఞప్తి మేరకు డివిజన్‌లోని రోమన్ కేథలిక్ చర్చి ప్రాంతంలో కల్వ ర్టు నిర్మించాలని కోరగా.. స్పందించిన మేయర్ ఇంజనీరింగ్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. అనంతరం డివిజన్‌లోని కబేలాతో పాటు చేపల మార్కెట్ ప్రాంతాన్ని మేయర్ పరిశీలించారు.
మేయర్ గుండు సుధారాణి
కార్మికులకు హెల్త్ కార్డుల పంపిణీ


