సమస్యలు సత్వరమే పరిష్కరించండి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: అర్జీలను సత్వరమే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అర్జీదారుల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. మొత్తం ప్రజావాణికి 153 అర్జీలు అందాయి. అర్జీల పరిష్కార స్థితిని తప్పనిసరిగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని, సరైన రిమార్కులు లేకుండా దరఖాస్తులు క్లోజ్ చేయరాదని సూచించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, పరకాల, హనుమకొండ ఆర్డీఓలు కన్నం నారాయణ, రాథోడ్ రమేశ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ గ్రీవెన్స్‌కు 151 అర్జీలు..
న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని పలువురు బాధితులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ సత్యశారదకు మొరపెట్టుకున్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మొత్తం 151 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, జెడ్పీసీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు సత్వరమే పరిష్కరించండి


