మెస్ బిల్లుల్లో అవకతవకలపై విచారణకు కమిటీ
కేయూ క్యాంపస్: కేయూ కామన్‌మెస్‌లోని 10 నెలల మెస్ బిల్లుల్లో అవకతవకలపై విచారణకు కమిటీ వేశామని రిజిస్ట్రార్ వి.రామచంద్రం తెలిపారు. అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కామన్‌మెస్‌లో శనివారం రిజిస్ట్రార్ వి.రామచంద్రం, హాస్టళ్ల డైరెక్టర్ ఎల్పీ రాజ్‌కుమార్ నిర్వహించిన సమావేశంలో విద్యార్థులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. గ్యాస్ వినియోగించని రోజులకు కూడా గ్యాస్ బిల్లులు వేశారని విద్యార్థులు ఆరోపించారు. నాన్ బోర్డర్లు కూడా రాకుండా చూడాలని, కేర్‌టేకర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. తాము సమస్యలపై అడుగుతుంటే పోలీసులను పిలిపించడం సరికాదని పేర్కొన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ బిల్లులు అధికంగా ఎందుకు వచ్చాయో పరిశీలన చేయిస్తామని రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు. నాన్‌బోర్డర్లు రాకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. అనంతరం విద్యార్థ్ధులతో కలిసి రిజిస్ట్రార్ రామచంద్రం, డైరెక్టర్ రాజ్‌కుమార్ తదితరులు భోజనం చేశారు. కేయూ స్టూడెంట్స్ ఆఫైర్స్ డీన్ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, కేయూ అభివృద్ధి అఽధికారి ఎన్.వాసుదేవరెడ్డి, జాయింట్ డైరెక్టర్లు ఉన్నారు.


