ఒగ్గు పదం.. డోలు పాదం
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2026
జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం మాణిక్యాపురానికి చెందిన ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ పురస్కార గ్రహీత డాక్టర్ ఒగ్గు రవి బృందం ఈ నెల26న ఢిల్లీ పరేడ్‌లో ప్రదర్శన ఇవ్వనుంది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నుంచి వీరికి ఆహ్వానం అందింది. ఈనెల 8న ఢిల్లీ వెళ్లి అక్కడే 25 వరకు రిహార్సల్స్ చేసి 26న ఢిల్లీ కర్తవ్యపథ్ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతంలో మొదలైన వీరి ఒగ్గుడోలు విన్యాసం తొలిసారి ఢిల్లీ పరేడ్‌లో ఆకట్టుకోనుంది.
చుక్కా సత్తయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని..
మండలంలోని మాణిక్యాపురానికి చెందిన ఒగ్గు కథ పితామహుడు చుక్కా సత్తయ్య కథకు డోలు విన్యాసం తోడై అనేక ప్రదర్శనలతో దేశవిదేశాల్లో ఎన్నోసార్లు కళాకారులు డోలు విన్యాసాన్ని ప్రదర్శించారు. చుక్కా సత్తయ్య వారసత్వాన్ని అదే గ్రామానికి చెందిన చౌదరిపల్లి రవికుమార్ అలియాస్ ఒగ్గు రవి పుణికి పుచ్చుకుని ప్రదర్శనలు ఇస్తున్నారు. డోలు విన్యాసంలో ఓంకారం, సమ్మెట, పాంచ్‌పటాకా, తాండవం, శిఖరం, కోలాటం ఇలా అనేక రకాల డోలు విన్యాసాలతో పాటు దశావతారాలు, పోతరాజులు, శివసత్తులు, విష్ణురూపం, శివశక్తుల విన్యాసం వంటి అనేక ప్రదర్శనల్లో దాదాపు 5 వేల మంది యువకళాకారులకు శిక్షణ ఇచ్చారు.
దేశవిదేశాల్లో 26 ఏళ్లుగా ప్రదర్శనలు..
ఒగ్గు రవి, బృందం సుమారు 26 ఏళ్లుగా దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చింది. తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్, తాజ్ ఉత్సవాలు, అంతర్జాతీయ వేదికలతో దేశంలోని పలు రాష్ట్రాల్లో తమ ప్రదర్శనలిచ్చారు. అంతేకాకుండా స్పెయిన్, మలేషియా, న్యూజిలాండ్, సింగపూర్, దోహ వంటి తదితర 12 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. కాగా, ఢిల్లీ పరేడ్‌లో ఒగ్గుడోలు విన్యాసాల ప్రదర్శనకు తెలంగాణ నుంచి 30 మంది కళాకారుల బృందం వెళ్తుండగా.. జనగామ జిల్లా నుంచి చౌదరిపల్లి రవికుమార్, మరికుక్కల అశోక్, గువ్వల మధు ఉన్నారు.
విన్యాస శిక్షణకు న్యాయం జరిగింది..
ఎన్నో ఏళ్లుగా ఒగ్గుడోలు ప్రదర్శనలో ఉస్తాద్ ఒగ్గు రవి ఇచ్చిన శిక్షణకు న్యాయం జరిగింది. ఇంతటి అవకాశం కల్పించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మా గురువైన ఒగ్గు రవి కష్టానికి తగిన ఫలితం దక్కింది. మేమంతా అక్కడ విన్యాసాలు చేయనుండడం ఎంతో ఆనందాన్నిస్తోంది.
ఆనందంగా ఉంది..
ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసాల ప్రదర్శనకు అవకాశం రావడం ఆనందంగా ఉంది. దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చాం. కానీ, ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎదుట ప్రదర్శనలు ఇచ్చే అవకాశం రావడం సంతోషంగా ఉంది. భారత ప్రభుత్వానికి, తెలంగాణకు రుణపడి ఉన్నాం.
ఉపరాష్ట్రపతితో ఒగ్గుడోలు కళాకారులు (ఫైల్)
అస్సలు ఊహించలే..
గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసానికి అవకాశం దక్కుతుందని అస్సలు ఊహించలే. ఎన్నో చోట్ల ప్రదర్శనలు ఇచ్చాం. ఇలాంటి అవకాశం రావడం సంతోషం. భవిష్యత్‌లో మరెన్నో అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాం.
– మరికుక్కల అశోక్, మాణిక్యాపురం, ఒగ్గుడోలు కళాకారుడు
●
ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన
– ఒగ్గు, రవికుమార్, మాణిక్యాపురం
(ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ జాతీయ పురస్కార గ్రహీత)
గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు ప్రదర్శనకు ఓరుగల్లు కళాకారులు
మాణిక్యాపురం కళాకారుడు ఒగ్గు రవి బృందానికి అందిన ఆహ్వానం
జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపునకు అవకాశం
8న ఢిల్లీకి వెళ్లనున్న కళాకారుల బృందం.. 25వ తేదీ వరకు రిహార్సల్స్
ఒగ్గు పదం.. డోలు పాదం
ఒగ్గు పదం.. డోలు పాదం
ఒగ్గు పదం.. డోలు పాదం
ఒగ్గు పదం.. డోలు పాదం


