అభివృద్ధి పనుల అంచనాల పరిశీలన
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మూడో డివిజన్ ఆరెపల్లిలో అభివృద్ధి పనుల ప్రతిపాదిత అంచనాలను కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ శనివారం పరిశీలించారు. ఆరెపల్లిలో ప్రతిపాదిత సీసీరోడ్డు, డ్రెయినేజీ పనులు పరిశీలించి, టౌన్‌ప్లానింగ్, ఇంజనీర్లతో చర్చించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డీఈ సతీశ్, టీపీఎస్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
పాత కలెక్టర్ బంగ్లా పరిశీలన
నయీంనగర్: పాత కలెక్టర్ బంగ్లా పనులను కుడా వైస్ చైర్‌పర్సన్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ శనివారం పరిశీలించారు. వారసత్వ కట్టడాలను రక్షించడానికి కుడా ఆధ్వర్యంలో చేపట్టిన పాత కలెక్టర్ బంగ్లా పునరుద్ధరణ, బంగ్లా ఆవరణలో గార్డెనింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో పనులు పరిశీలించారు.
ఖిలా వరంగల్: యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరిపడా యూరియా అందుబాటులో ఉందని వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీఏసీఎస్, ప్రైవేట్ డీలర్ల వద్ద 890 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని, మార్క్‌ఫెడ్‌లో 3,300 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.


