కలెక్టరేట్‌లో సావిత్రిబాయి పూలే జయంతి
ఉత్తమ టీచర్లకు అవార్డులు
హన్మకొండ అర్బన్: సావిత్రిబాయి పూలే జయంతిని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రి బాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించి, విద్యా బోధనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్ సత్కరించి ప్రశంసపత్రాలు అందించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ వైవీ గణేశ్, డీఈఓ గిరిరాజ్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.


