సమష్టి కృషితోనే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన
వరంగల్ క్రైం: ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమష్టి కృషితోనే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఆపరేషన్ స్మైల్ –12లో భాగంగా మంగళవారం కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పారిశ్రామిక ప్రాంతాలు, షాపుల్లో, ప్రమాదకర ప్రాంతాల్లో కార్మిక శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ యూనిట్.. స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ ద్వారా 339 బాలలను కాపాడి 26 ఎఫ్‌ఐఆర్‌లు, 160 ఐఆర్‌లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ యూనిట్ ఇన్‌స్పెక్టర్ శ్యామ్ సుందర్, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ వినోద, ఎన్‌సీఎల్‌పీ డైరెక్టర్ అశోక్ కుమార్, బాలల సంక్షేమ స మితి చైర్మన్‌లు ఉప్పలయ్య, వసుధ, సభ్యుడు పరికి సుధాకర్, జిల్లా బాలల పరిరక్షణ అధికారులు ఎస్. ప్రవీణ్ కుమార్, ఎల్. రవికాంత్, ఉమా, చైల్డ్ హె ల్ప్ లైన్ కోఆర్డినేటర్లు ఎస్. భాస్కర్, కల్పన, రవికుమార్, ఎస్సై సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
అధికారుల పనితీరుపై పర్యవేక్షణ ఉండాలి..
స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరును పోలీస్ ఉన్నతాధికారులు నిరంతం పర్యవేక్షించాలని సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం సెంట్రల్ జోన్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వరంగల్, హనుమకొండ, కాజీపేట డివిజన్ల సంబంధించిన పలు రికార్డులతోపాటు, గ్రీవెన్స్ ఫిర్యాదులు, రౌడీషీటర్ల వివరాలతో కూడిన ఫైళ్లను పరిశీలించి డీసీపీ దార కవితకు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో వరంగల్ ఏఎస్పీ శుభం, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్రా పాల్గొన్నారు.
వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్


