1న వరంగల్‌ మార్కెట్‌కు సెలవు | - | Sakshi
Sakshi News home page

1న వరంగల్‌ మార్కెట్‌కు సెలవు

Dec 31 2025 8:44 AM | Updated on Dec 31 2025 8:44 AM

1న వర

1న వరంగల్‌ మార్కెట్‌కు సెలవు

వరంగల్‌: ఆంగ్ల నూతన సంవత్సరం ఆరంభం రోజు గురువారం (జనవరి 1, 2026)న గుమస్తా, దడవాయి, హమాలీ, వ్యాపారులు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ – ఇండస్ట్రీస్‌ కోరిక మేరకు వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు మార్కెట్‌ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్‌.మల్లేశం మంగళవారం ప్రకటనలో తెలి పారు. సెలవు నేపథ్యంలో మార్కెట్‌లో ఎలాంటి క్రయ, విక్రయాలు జరగవని తెలిపారు. శుక్రవారం మార్కెట్‌ పునఃప్రారంభమవుతుందన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. యార్డు బంద్‌ ఉన్నా 1వ తేదీన (గురువారం) జిన్నింగ్‌ మిల్లుల్లోని సీసీఐ కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేస్తారని మల్లేశం తెలిపారు.

పేకాట శిబిరంపై పోలీసుల దాడి..

తొమ్మిది మంది అరెస్ట్‌.. రూ.1,86,020 స్వాధీనం

మూడు కార్లు, తొమ్మిది సెల్‌ఫోన్లు సీజ్‌

హసన్‌పర్తి: గోపాలపురంలో నిర్వహిస్తున్న ఓ పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్‌, కేయూసీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో తొమ్మిది మందిని అరెస్ట్‌ చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌ తెలిపారు. గోపాలపురంలోని చింతల రాజు ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి టాస్క్‌ ఫోర్స్‌, కేయూ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాడుతున్న గోపాలపురానికి చెందిన చింతల రాజు, పిట్టల రామ్మోహన్‌, పిట్టల ప్రవీణ్‌, సీతంపేటకు చెందిన డి. వీరస్వామి, హనుమకొండ భవానీనగర్‌కు చెందిన గొట్టిముక్కుల రవికుమార్‌, హుస్నాబాద్‌కు చెందిన కారెపు శ్రీనివాస్‌, దేవన్నపేటకు చెందిన సూరం మల్లికార్జున్‌, హనుమకొండ నక్కలగుట్టకు చెందిన కందారపు చంద్రమౌళి, భీమారానికి చెందిన లాలెల్లా శివప్రసాద్‌ను అరెస్ట్‌ చేసి వారిని వద్ద నుంచి రూ.1,86,020 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మధుసూదన్‌ తె లిపారు. అలాగే, మూడు కార్లు, తొమ్మిది సెల్‌ఫోన్లు సీజ్‌ చేసినట్లు ఏసీపీ వివరించారు. ఈ దాడిలో ఇన్‌స్పెక్టర్‌ బాబులాల్‌,ఎస్సై చందర్‌, వీరస్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బావిలో పడి వ్యక్తి మృతి

ఖిలా వరంగల్‌: చేద బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం ఆలస్యం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన వీరసారపు గణేశ్‌కుమార్‌(40) ఎలక్ట్రీషియన్‌ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీన మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. అనంతరం సాయంత్రం 6గంటల సమయంలో బయటకెళ్లి ఇంటికి రాలేదు. మంగళవారం ఎస్‌ఆర్‌ఆర్‌తోటలోని చేదబావిలో అతడి చెల్లికి చనిపోయి కనిపించాడు. వెంటనే మిల్స్‌కాలనీ పోలీసులకు సమాచారం అందజేయగా వారు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతికి గల వివరాలు సేకరించి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఎవరిపై ఎలాంటి అనుమానాలు లేవని, ప్రమాదవశాత్తు కాలు జారి చేదబావిలో పడి మృతి చెంది ఉంటాడని మృతుడి భార్య సృజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ బొల్లం రమేశ్‌ తెలిపారు.

విద్యుత్‌ ఉద్యోగుల

సంక్షేమానికి ప్రాధాన్యం

టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి

హన్మకొండ : విద్యుత్‌ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో జనగామ సర్కిల్‌ రఘునాథపల్లి సబ్‌ డివిజన్‌ నర్మెట సెక్షన్‌లో పనిచేస్తూ మృతి చెందిన అన్‌మ్యాన్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్‌ బానోత్‌ రాజు సతీమణి నీలకు న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌ కంపెనీకి చెందిన బీమా రూ.25 లక్షల చెక్కును అందజేశారు. సందర్భంగా నీలకు ఉద్యోగం కల్పించాలని సీఎండీని కోరగా సానుకూలంగా స్పందించారని విద్యుత్‌ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్‌రావు, వి .తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్‌, సి.ప్రభాకర్‌, సీఈలు, ఎస్‌ఈలు, తదితరులు పాల్గొన్నారు.

1న వరంగల్‌  మార్కెట్‌కు సెలవు
1
1/2

1న వరంగల్‌ మార్కెట్‌కు సెలవు

1న వరంగల్‌  మార్కెట్‌కు సెలవు
2
2/2

1న వరంగల్‌ మార్కెట్‌కు సెలవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement