గ్రాంట్ ఇన్ ఎయిడ్‌తో వేతనాలివ్వాలి
కాళేశ్వరం: రాష్ట్రంలోని అర్చక, ఉద్యోగులందరికీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రకారం దేవాలయాల నుంచి వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర అర్చక, ఉద్యోగ జేఏసీ అద్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం వసతి గృహంలో విలేకరులతో మాట్లాడారు. అర్చక, ఉద్యోగుల సమస్యలపై జనవరి 2న వరంగల్‌లో సమావేశం నిర్వహిస్తున్నామని, దీనికి ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలి రావాలన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో తమ సమస్యలు 40శాతం పూర్తయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ సమస్యల పరిష్కార దిశగా రెండు దఫాలుగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశామన్నారు. ఆయన దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్తామన్నారు. 121 జీఓను రద్దు చేసి 577 జీఓను పూర్తి స్థాయిలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, ఉప ప్రధాన అర్చకులు ఫణీంద్రశర్మ, శరత్‌చంద్రతోపాటు అర్చక, ఉద్యోగులు పాల్గొన్నారు.
అర్చక, ఉద్యోగ జేఏసీ
రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ


