మేడారం, వేములవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హన్మకొండ: జాతర, పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. మేడారం జాతర, వేములవాడకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. కనీసం 30 మంది ప్రయాణికులు ఉండాలన్నారు. 2026 జనవరి నుంచి ఈ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు డీఎం పేర్కొన్నారు. ప్రయాణికులు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
కేయూ క్యాంపస్: చైన్నెలోని వెల్స్ యూనివర్సిటీలోఈనెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న 108వ ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ సదస్సుకు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎకనామిక్స్ విభాగం ఇన్‌చార్జ్ డాక్టర్ శ్రీధర్‌కుమార్‌లోథ్ హాజరుకానున్నారు. సదస్సులో ‘రోల్ ఆఫ్ ట్రైబల్ ఉమెన్ ఇన్ అగ్రికల్చ ర్ యాక్టివిటీస్ ఆన్ ఎంపిరికల్ ఇన్వెస్టిగేషన్’ అంశంపై శ్రీధర్‌కుమార్‌లోథ్ పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు.
కేయూ క్యాంపస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో ఉన్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఈనెల 28 నుంచి 30 వరకు 50వ అఖిల భారత సోషియాలజీ సదస్సు నిర్వహించనున్నారు. కాకతీయ యూనివర్సిటీ సోషియాలజీ విభాగం ప్రొఫెసర్ కుంట అయిలయ్య సదస్సుకు హాజరుకానున్నారు. ‘మొబిలిటీస్ అండ్ ఇన్ క్వాలిటీస్ షిఫ్టింగ్ కాంటెక్ట్స్ చేంజింగ్ పారాడిగ్మ్స్’ అంశంపై నిర్వహించనున్న ఒక సెషన్‌కు ఆయన చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే ‘ఎ స్టడీ ఆన్‌ది రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్స్ ఇన్ రిలేషన్ ఇన్ సోషల్ చేంజ్ అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు.
ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని ఖిలావరంగల్ కోటను శుక్రవారం స్విట్జర్లాండ్ దేశస్తులు సందర్శించారు. ఈసందర్భంగా వారు కాకతీయుల కీర్తితోరణాల నడుమ ఉన్న అద్భుత శిల్ప సంపదను వీక్షించారు. ఆతర్వాత ఖుష్‌మహల్, రాతి, మట్టికోట అందాలు, ఏకశిలగుట్ట, శృంగారపు బావిని తిలకించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను పర్యాటక శాఖ గైడ్ రవియాదవ్ వివరించారు. కోటను సందర్శించడం తాము అదృష్టంగా భావిస్తున్నామని విదేశీయులు పేర్కొన్నారు. వారి వెంట కేంద్ర పురావస్తుశాఖ కోఆర్డినేటర్ శ్రీకాంత్, సౌండ్ అండ్ లైటింగ్ షో ఇన్‌చార్జ్ గట్టికొప్పుల అజయ్ ఉన్నారు.
మేడారం, వేములవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
మేడారం, వేములవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
మేడారం, వేములవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు


