స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
కాజీపేట: స్థానిక యువతకు రైల్వే మ్యాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు కాజీపేట చౌరస్తాలో భూనిర్వాసితులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య మాట్లాడుతూ స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యం ఇవ్వకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు మల్లేశం, వీరన్న, భిక్షపతి, ప్రదీప్ పాల్గొన్నారు.
నేడు కాజీపేటలో రౌండ్‌టేబుల్ సమావేశం
కాజీపేట రైల్వే కమ్యూనిటీహాల్‌లో శనివారం ఉదయం 10 గంటలకు రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. పట్టణంలోని ఆరు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, ఆయా పార్టీల డివిజన్ల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ప్రజాసంఘాల నాయకులు హాజరవుతున్నారు. ఉద్యోగాల కల్పనపై సమావేశంలో చర్చించనున్నట్లు జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు తెలిపారు.


