రిపబ్లిక్‌డే పరేడ్‌కు ఎన్‌సీసీ కేడెట్ల ఎంపిక
విద్యారణ్యపురి: న్యూఢిల్లీలో జనవరి 26న జరగనున్న ఆర్‌డీ (రిపబ్లిక్ డే) పరేడ్‌కు హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన ముగ్గురు ఎన్‌సీసీ కేడెట్స్ ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి తెలిపారు. జి.వెంకటలక్ష్మి (బీఎస్సీ ఎంపీసీసీఎస్ ఫైనల్ ఇయర్), బి.త్రిష (బీఎస్సీ బీజెడ్‌సీ ఫైనల్ ఇయర్), ఎ.భార్గవి (బీఎస్సీ ఎంపీసీఎస్ ద్వితీయ సంవత్సరం) ఉన్నారు. రిపబ్లిక్‌డే పరేడ్‌కు ఎంపికై న వీరు శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. విద్యార్థినులను ప్రిన్సిపాల్ చంద్రమౌళి, ఎన్‌సీసీ ఆఫీసర్ సువర్ణ, వైస్ ప్రిన్సిపాల్ జి.సుహాసిని, అధ్యాపకులు అభినందించారు. క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించే ఎన్‌సీసీ విద్యార్థినుల్లో స్ఫూర్తి నింపుతుందని పేర్కొన్నారు.


