తిమ్మరాయినిపహాడ్‌లో జిల్లాలోనే అతిపెద్ద చర్చి ..
నర్సంపేట: వరంగల్ జిల్లాలో పెద్ద చర్చిగా పిలువబడుతున్న తిమ్మరాయినిపహాడ్‌లోని పునీత రాయప్ప దేవాలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1924లో కమ్మ కులస్తులు ఈ గ్రామాన్ని స్థాపించారు. 1930లో ఫాదర్ పజలీనా కాజీపేట నుంచి వస్తూ స్వరూపాలు, పటాలు అందిస్తూ దైవ కార్యాలు నిర్వహించేవారు. చిన్న పూరి గుడిసెలో మొదట క్రిస్మస్ వేడుకలు నిర్వహించేవారు. 1956లో నూతన చర్చి పనులు ప్రారంభించి 1967లో పూర్తి చేశారు.
యూఎస్‌ఏలో స్థిరపడిన నేను క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి స్వగ్రామం చేరుకున్నా. నాన్నతో ఈ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది.
బెల్లంకొండ విజయరాజు, తిమ్మరాయినిపహాడ్
ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి
ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రామంలో 90 శాతం మంది ప్రజలు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించాం. రాత్రి నుంచి ప్రార్థనలు జరుగుతున్నాయి.
తిమ్మరాయినిపహాడ్‌లో జిల్లాలోనే అతిపెద్ద చర్చి ..
తిమ్మరాయినిపహాడ్‌లో జిల్లాలోనే అతిపెద్ద చర్చి ..


