వినియోగదారుల చట్టంపై అవగాహన ఉండాలి
● వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి
రామన్నపేట: వినియోగదారుల చైతన్యంతో మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ ఏవీవీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి, కాలేజ్ కన్జ్యూమర్ క్లబ్స్ కోఆర్డినేటర్ కోడిమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం వినియోగదారుల హక్కులు, పరిరక్షణపై చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని హైస్కూల్, కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అదనపు కలెక్టర్ సంధ్యారాణి బహుమతులు అందించారు. అనంతరం కోడిమాల శ్రీనివాసరావు రూపొందించిన వాల్ పోస్టర్‌ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. డీసీఎస్‌ఓ కృష్ణయ్య, క్యాట్కో రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ లాల్ చౌరాసియా, వరంగల్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, ఇండస్ట్రియల్ మేనేజర్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
వినియోగదారుల్లో చైతన్యం రావాలి
న్యూశాయంపేట: వినియోగదారుల్లో చైతన్యం రావాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. కలెక్టనూటఖలెలో బుధవారం వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారులకు సత్వరం న్యాయం అందించేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


