చరిత్రకు సజీవ సాక్ష్యం.. ఉండ్రుపుర చర్చి
జనగామ: జనగామలోని ఉండ్రుపుర సెంటనరీ బాపిస్టు చర్చి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలు స్తోంది. లోకరక్షకుడి సేవలో 125 ఏళ్లుగా సేవలందిస్తోంది. 1901లో స్థాపితమైన చర్చి.. అనేక సేవా కార్యక్రమాలతో జిల్లాలో తల్లి సంఘం చర్చిగా నామకరణం పొందింది. రష్యా చెందిన దంపతులు అన్న ఉన్రు(భార్య), హెర్ని ఉన్రు (భర్త) అనేక దేశాలు పర్యటిస్తూ జనగామకు చేరుకున్నారు. 1901 నుంచి వారి సేవలను కొనసాగిస్తూ ప్రెస్టన్ ఇన్‌స్టిట్యూట్ నుంచి చర్చి సేవలు, ప్రార్థనలు కొనసాగాయి. ఆ తర్వాత ఆర్టీసీ బస్టాండ్ ఎదుట(ప్రస్తుతం)కు మార్చారు. రష్యాకు చెందిన ఉన్రు దంపతులకు 8 మంది సంతా నం కలగగా చదువు ఇక్కడే పూర్తి చేశారు. తదనంతరం వారు రష్యా, అమెరికాకు వెళ్లి పోయారు. కాలక్రమేనా 1912లో భర్త హెర్ని ఉన్రు మృతి చెందగా, భార్య అన్న ఉన్రు 1921లో రష్యాలో మృతి చెందారు. ఉన్రు పెద్ద కూతురు తండ్రితోనే జనగామలో ఉంటూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారు. ఆమె కూడా చనిపోవడంతో ప్రెస్టన్‌లోని తండ్రి సమాధి పక్కనే ఖననం చేశారు.
2002లో నూతన చర్చి ప్రారంభం..
2000లో నూతన భవన నిర్మాణం కోసం భూమి పూజ చేసి 2002లో చర్చిని ప్రారంభించారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీ దుగా ఉండ్రుపుర సెంటనరీ బాపిస్టు చర్చిలో విద్యుత్ వెలుగులు ప్రారంభించారు. ఇప్పటి వరకు అనేక మంది పాస్టర్లు కరుణామయుడి సన్నిధిలో సేవలందించారు.
చరిత్రకు సజీవ సాక్ష్యం.. ఉండ్రుపుర చర్చి


