‘అంపశయ్య నవీన్’ ఓరుగల్లుకు సాహిత్య సంపద
● కేయూ విశ్రాంతాచార్యుడు అయిలయ్య
హన్మకొండ కల్చరల్ : అంపశయ్య నవీన్ ఓరుగల్లుకు సాహిత్య సంపదలాంటి వారని కేయూ విశ్రాంతాచార్యుడు బన్న అయిలయ్య అన్నారు. బుధవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ 85వ జన్మదిన వేడుక నిర్వహించారు. అదే విధంగా ప్రధమ నవల పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ మేరకు మిత్రమండలి, వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ, నేరేళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ సౌజన్యంతో బుధవారం హనుమకొండ ఎకై ్సజ్ కాలనీలోని నవీన్ రెసిడెన్సీలో జరిగిన సమావేశానికి బన్న అయిలయ్య అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్ దర్భశయనం శ్రీనివాసాచార్య, బన్న అయిలయ్య పాల్గొని నవీన్ రచించిన భిన్న ధృవాలు, బుచ్చిబాబు జీవితం– సాహిత్యం పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం ‘అమ్మడైరీ’ నవలకు గాను రచయిత్రి వసంతశ్రీ, ‘పడిలేచిన కెరటం’ నవలకు గాను రచయిత జీవీ శ్రీనివాస్‌కు ఉత్తమ ప్రథమ, ద్వితీయ నవలాపురస్కారాలను అందజేశారు. సాహితీవేత్త అశోక్‌కుమార్, దొంగరి శశికిరణ్ నవీన్ నవలలను పరిచయం చేశారు. ప్రముఖ విమర్శకుడు గన్నమరాజు గిరిజామనోహర్‌బాబు, సాహితీవేత్తలు వకుళవాసు, వీఆర్ విద్యార్థి, నాగిళ్ల రామశాస్త్రి, నెల్లుట్ల రమాదేవి, ఘంటా రామారెడ్డి, పందిళ్ల అశోక్‌కుమార్, డి. రాజేశ్వరరావు, దొంగరి స్వప్న, దొంగరి శశికిరణ్, సతీశ్, పాల్గొన్నారు.


