బకాయిలు చెల్లించాలి
● రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్
హన్మకొండ: రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ల ధర్మేంద్ర, పెన్షనర్స్ జేఏసీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు జి.నర్సింహా రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ, తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వారు మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలు 20 నెలలైనా చెల్లించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 35 మంది బకాయిలు రాక బాధతో ఆరోగ్యం క్షీణించి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. బీ జేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రా వు పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, ఆయా ఉద్యోగ, ఉపాధ్యా య సంఘాల బాధ్యులు దీక్షకు సంఘీభా వం తెలిపారు. ఈదీక్షలో ఆయా సంఘాల బాధ్యులు ఈ.రాంమనోహర్, కడారి భోగేశ్వర్, టి.పురుషోత్తం, కె.సుధీర్‌బాబు, టి.వీరయ్య, దేవదాసు, సాంబయ్య, సమ్మారెడ్డి, మహబూబ్ అలీ, ఇంద్రసేనారెడ్డి, విశ్వనాథం, రవీందర్, రఘువీర్, రాజిరెడ్డి, సమ్మయ్య పాల్గొన్నారు.


