విద్యుత్ వెలుగుల్లో ‘సీబీసీ’ జిగేల్ ..
ఖిలా వరంగల్: వరంగల్ క్రిస్టియన్ కాలనీలో 137 సంవత్సరాల చరిత్ర గల సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. చర్చి ఫాదర్లు రెవరెండ్ పుల్ల జగ్జీవన్ బాబ్జీ, ఎం. ఆత్యుష్, కార్తీక్ అబ్రహ్మ సంయూక్త ఆధ్వర్యంలో బుధవారం రాత్రి 9 గంటల నుంచి క్రైస్తవులు అర్ధరా త్రిని స్వాగతించారు. 12 గంటలకు కేక్ కేట్ చేసి పరస్పరం శు భాకాంక్షలు తెలుపుకున్నారు. కాగా, సీబీసీ విద్యుత్ దీపాల వె లుగులో జిగేల్‌మంటోంది. వేడుకలకు లక్ష మంది భక్తులు తరలొచ్చిన నేపథ్యంలో అందుకు తగ్గట్లు చర్చి నిర్వాహకులు ఏ ర్పాట్లు చేశారు. చర్చి ఎదుట ప్రత్యేక దుకాణాలు, రంగుల రా ట్నాలు ఏర్పాటు చేయడంతో జాతరను తలపిస్తోంది. కార్యక్రమంలో చర్చి కమిటీ ప్రెసిడెంట్ పోలెపాక మనోహర్, ఉపాధ్యక్షుడు పోలెపాక రత్న బాబు, కార్యదర్శి మేగల భరత్, కోశాధికారి బషికే విజయ్‌కుమార్, పోలేపాక కిరణ్ కుమార్, బైరపా క సామేల్ రాజ్, గుండేటి శ్యామ్, మడిపెల్లి ప్రాన్సిస్ జాశ్వా , లిమ్యూల్, తదితరులు పాల్గొన్నారు.


