పీఆర్సీని ప్రకటించాలి
విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీని ప్రకటించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండలోని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ము ఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికై న ఆరునెలలలోపు మేనిఫెస్టోలో పెట్టినట్లుగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం శోఛనీయమన్నారు. ఐదు డీఏలు విడుదల చేయకుండా జాప్యం చేస్తోందని విమర్శించారు. ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23ను సవరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ చైర్మన్ రాజశేఖర్‌రెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.రవీందర్‌రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు డి.కిరణ్‌కుమార్, ఆల్ పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర బాధ్యులు సీతారాం, జిల్లా కార్యదర్శులు సీహెచ్.లింగారావు, మోజెస్, చంద్రయ్య, ప్రసన్నానంద్, కె.సదానందం, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.రాజారాం, ఎస్.జ్యోతి, గురుకుల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
టెట్ నుంచి టీచర్లను మినహాయించాలి
టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి


