మైసమ్మ ఆలయం కూల్చివేత.. నిరసనలు
వరంగల్: నగరంలోని 3వ డివిజన్ పైడిపల్లిలో మై సమ్మ ఆలయాన్ని అధికారులు తొలగించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలో ఉన్న మైసమ్మ విగ్రహం వద్ద ఆలయం నిర్మాణం చేపట్టారు. ఇది ‘కుడా’ వెంచర్‌కు అడ్డుగా ఉందని, రహదారి పక్క నే ఉండడం వల్ల కొంత మంది అధికారులకు ఫిర్యా దు చేసినట్లు తెలిసింది. ఈమేరకు నిర్మాణంలో ఉన్న మైసమ్మ ఆలయాన్ని మంగళవారం రాత్రి భారీ పోలీసు బందోబస్తు మధ్య తొలగించారు. కూ ల్చివేతను అడ్డుకునేందుకు ఆలయ నిర్మాణ దాత బొల్లం రవి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఎంజీఎం తరలించారు. హిందూ ఆలయం కూల్చి వేశారన్న విషయం తెలియడంతోనే బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వరంగల్, ఏటూరునాగారం జాతీయ రహదారిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ నేతృత్వంలో బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేవలం హిందూ ఆలయాలనే లక్ష్యం చేసుకున్నారని, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, అర్ధరాత్రి వేళల్లో కూల్చివేతలు చేపట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. కూల్చివేసిన ఆలయాన్ని వెంటనే పునర్నిర్మించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని గంట రవికుమార్ డి మాండ్ చేశారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
నిర్మాణ దాత రవి ఆత్మహత్యాయత్నం


