ప్రపంచం దృష్టి భారత్ వైపు..
కేయూ క్యాంపస్: దేశ పునర్మిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేస్తూ ఈ దేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టే ప్రయత్నంలో ఏబీవీపీ నిమగ్నమైందని, ప్రపంచం దృష్టి భారత్ వైపు చూస్తోందని అఖిలభారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జాతీయ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ అన్నారు. రెండురోజుల నుంచి ఏబీవీపీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో కొనసాగిన రాష్ట్రంలోని యూనివర్సిటీల విద్యార్థుల సమ్మేళనం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొన్ని విద్యార్థి సంఘాలు విద్యార్థులను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తుంటే ఈ దేశం కోసం, మట్టికోసం చివరి శ్వాస వరకు ఏబీవీపీ విద్యార్థులు పోరాడుతున్నారన్నారు. సమాజంలో అందరిని కలుపుకుని దేశం కోసం పనిచేసేది ఏబీవీపీ కార్యకర్తలేనన్నారు. ఏబీవీపీ ప్రాంత ప్రముఖ్ మాసాడిబాబురావు, రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, యూనివర్సిటీస్ హాస్టళ్ల కన్వీనర్ జీవన్, కేయూ ఇన్‌చార్జ్ నిమ్మల రాజేశ్, అధ్యక్షుడు ఉబ్బటి హరికృష్ణ ,కార్యదర్శి జ్ఞానేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
ఏబీవీపీ జాతీయసహ సంఘటన
కార్యదర్శి బాలకృష్ణ
ప్రపంచం దృష్టి భారత్ వైపు..


