బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
హన్మకొండ చౌరస్తా: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతిని మంగళవారం హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం జంక్షన్‌లో నిర్వహించారు. పీవీ కాంస్య విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టి భారతదేశ పురోగతిలో కీలకపాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి పీవీ అని కొనియాడారు. మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్, వేయిస్తంభాల ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు ఉన్నారు.


