ఒరిగిన విద్యుత్ స్తంభం..
హన్మకొండ: వరద తాకిడికి రోడ్డు కోతకు గురికావడంతో 11 కేవీ విద్యుత్ స్తంభం పక్కకు ఒరిగి ప్రమాదకరంగా మారింది. దీంతో సమీపంలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేసిన టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులు ప్రతామ్నాయ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అక్టోబర్ 29న కురిసిన భారీ వర్షానికి హనుమకొండలో వరద పోటెత్తింది. క్రమంలో ఇంజనీర్స్ కాలనీ సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్ ఎదుట నాలాను ఆనుకుని ఉన్న రోడ్డు పూర్తిగా కోతకు గురై 11 కేవీ విద్యుత్ స్తంభం పట్టుకోల్పోయి ఒక వైపు ఒరిగింది. విద్యుత్ లైన్ మరో ఇనుప స్తంభానికి తాకి ప్రమాదకరంగా మారగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఒరిగిన స్తంభం సమీపంలోనే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. దీంతో ఈ ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేసి అధికారులు ప్రత్యామ్నాయం ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. విద్యుత్ స్తంభం ఒరిగి పోయి, విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ నిరుపయోగంగా ఉన్నా ఎన్పీడీసీఎల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. విద్యుత్ స్తంభాన్ని తిరిగి నాటి విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని విద్యానగర్ వాసులు కోరుతున్నారు.


