పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
హన్మకొండ: పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని ఆల్ ఇండియా పెన్సనర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ, సెక్రటరీ జనరల్ డి.సుధాకర్ డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ సర్క్యూట్ హౌజ్ రోడ్‌లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో పెన్షనర్స్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. నూతన మీటింగ్ హాల్‌ను ప్రారంభించారు. 2026 డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిలుగా పాల్గొని మాట్లాడుతూ 1982లో వై.వి.చంద్రచూడు ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం డీ.ఎస్.నకార వేసిన కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు పొందుతున్న ప్రయోజనాలన్నీ 2026 జనవరి ఒకటి నుంచి వర్తించకుండా దుర్మార్గమైన పెన్షనర్స్ వాలిడేషన్ చట్టాన్ని రూపొందించారన్నారు. మార్చి 2024 నుంచి నవంబర్ 2025 వరకు రిటైర్డ్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ న్యాయంగా రావాల్సిన అన్ని బెన్‌ఫిట్లను చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా పెన్షనర్స్ ఫెడరేషన్ పూర్వ జాతీయ చైర్మన్ ఎస్.ఎస్.దూబే, పూర్వ సెక్రెటరీ జనరల్ జి.పూర్ణచందర్, రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజేంద్ర బాబు, ప్రధాన కార్యదర్శి ఎంవీ నర్సింగారావు, పెన్షనర్స్ అసోసియేషన్‌ల నాయకులు పాల్గొన్నారు.
ఆల్ ఇండియా పెన్షనర్ల ఫెడరేషన్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ


